UP: ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ మసీదులు, మదర్సాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా ఇండియా- నేపాల్ సరిహద్దుల్లోని ఉన్నవాటిపై అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక పోలీసులు, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) వంటి కేంద్ర దళాల సమన్వయంతో శుక్రవారం పెద్ద ఎత్తున యాక్షన్ చేపట్టింది.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. పాకిస్తాన్‌కి చెందిన లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ దాడి చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయంతో పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత వైమానిక సంస్థలకు మూసేసింది.
Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రటించుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ ప్రయేయాన్ని భారత దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌పై భారీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్య చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌కి భారత్ వరస షాక్‌లు ఇస్తోంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నది, దాని ఉపనదులకు సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ని భారత్ రద్దు చేసుకుంది. ఇక పాకిస్తాన్ సెలబ్రిటీలపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. భారత్‌లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు, సెలబ్రిటీలు, సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానెళ్లను ఇండియా బ్లాక్ చేస్తోంది.
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్‌లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ఇదే […]
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల, దాని వెనక ఉన్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదులు, వారి వెనక ఉన్నవారు, మద్దతుదారులను భారత్ విడిచిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
Supreme Court: పహల్గామ్ ఉగ్రవాదిలో 26 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ జాతీయులు వీసాలను రద్దు చేసింది. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జన్మించిన ఒక వ్యక్తిని, అతడి కుటుంబ సభ్యుల బహిష్కరణపై సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తుందో అని దాయాది దేశం భయపడి చస్తోంది. దీంతో, పాక్ సైన్యం అంతా హై అలర్ట్‌లో ఉంది. మరోవైపు, దాని భయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆయనతో పాటు పాక్ సైన్యంలో ముఖ్యమైన జనరల్స్ తన ఫ్యామిలీలను లండన్, న్యూ […]
Bilawal Bhutto: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు హతమార్చారు. లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. అయితే, అప్పటి నుంచి భారత్ పాకిస్తాన్‌పై ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.