Indian Air Force: గంగా ఎక్స్‌ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్.. ఉద్రిక్తల వేళ ఐఏఎఫ్ సత్తా..
- భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
- గంగా ఎక్స్‌ప్రెస్‌వే రన్ వే ప్రారంభానికి అంతా సిద్ధం..
- హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్‌లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ఇదే మొదటిది.
మీరట్-ప్రయాగ్ రాజ్‌లను కలిపే 594 కి.మీ పొడవైన గంగా హైవేపై జలాలాబాద్‌లో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ పనులు దాదాపుగా 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే, యూపీలోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దిగేందుకు అనువుగా రన్‌వేలు రూపొందించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే రన్ వే నాలుగోది.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
షాజహాన్‌పూర్ ఎయిర్‌స్ట్రిప్‌లో IAF రెండు దశల్లో ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహిస్తుంది.ఈ విన్యాసాలలో రాఫెల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులస్, AN-32 రవాణా విమానం మరియు MI-17 V5 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉంటాయి. యుద్ధం లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితుత్లో ఈ రన్‌వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐఏఎఫ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. విజిబులిటీ తక్కుగా ఉన్న రాత్రి సమయాల్లో సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ నిర్ధారించేందుకు ప్రెసిషన్ అప్రోచ్ లైటింగ్, రీన్‌ఫోర్స్డ్ పేవ్‌మెంట్ స్ట్రెంగ్త్, CAT II ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) సాంకేతికతను కలిగి ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గంగా ఎక్స్‌ప్రెస్ రన్‌వే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ విస్తృతఏర్పాటు చేసింది. దాదాపుగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని ఎయిర్‌ఫోర్స్ తన నియంత్రణలోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!