Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై స్పందించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఉగ్రవాదులను ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకొని శిక్షిస్తామని చెప్పారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలకు గట్టిగా సమాధానమిస్తున్నామని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పడం ఖాయమని అన్నారు.
Asaduddin Owaisi: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి దాయాది దేశం పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తరుచుగా చెప్పే ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’ అనే దానికి బదులుగా ‘‘ వాళ్ల ఇంట్లోకి ప్రవేశించి అక్కడే ఉండాలి, అంతే’’ అని కేంద్రానికి అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ భయానికి ఖాళీచేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ వారు ఖాళీ చేసి ఉంటే, మనం వెళ్లి అక్కడే ఉండాలి.…
Pakistan: పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. Read Also: Pahalgam […]
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
Namaz: ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) క్యాంపులోని విద్యార్థులతో ఓ ప్రొఫెసర్ బలవంతంగా నమాజ్ చేయించేందుకు ప్రయత్నించాడు. ఈ కేసుకు సంబంధించి గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో 8 మందిపై ఏప్రిల్ 26న ఎఫ్ఐఆర్ నమోదైంది.
High Court: వివాహ సమయంలో వధువుకు బహుమతిగా వచ్చే బంగారు ఆభణాలు, నగదు ఆమెకు సంబంధించిన ఆస్తి అని లేదా దానిని ‘స్త్రీ ధనం’’గా పరిగణించాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి ఆస్తిపై మహిళకు ప్రత్యేక హక్కులు ఉంటాయని చెప్పింది. ఎర్నాకుట కలమస్సేరికి చెందిన ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, ఎంబి స్నేహలతతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి , ఈ తీర్పుని చెప్పింది. విడాకుల తర్వాత పెళ్లి సమయంలో […]
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులను పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడితో సంబంధం ఉన్న, ఉగ్రవాదులకు సహకరించిన ఒవర్ గ్రౌండ్ వర్కర్లలో (OGW) ఒకరిని విచారిస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడైంది.
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ అయిన హఫీస్ సయీద్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం విస్తృత భద్రతను కల్పించింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతను మరించి పెంచింది. 26 మందిని టూరిస్టులు మరణించడానికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కారణం. దీంతో, భారత్ పాకిస్తాన్‌తో పాటు ఈ కుట్రకు పాల్పడిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను విడిచిపెట్టమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని సయీద్ ఇంటి చుట్టూ ఇప్పుడు నిఘాను…
CWC Meeting: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరుగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఇందుకు ఏఐసీసీ పాత కార్యాలయం వేదిక కానుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరవుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు హాజరు అవుతారు.
Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు. Read Also: Shahid Afridi: షాహిద్ […]