PM Modi: ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి, ప్రధానిగా ఆంథోని అల్బనీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఆంథోనీ అల్బనీస్‌కి ప్రధాని నరేంద్రమోడీ శనివారం అభినందనలు తెలియజేశారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పారు. 21 ఏళ్ల చరిత్రలో అల్బనీస్ వరసగా రెండుసార్లు విజయం సాధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. Read Also: Panipuri […]
Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్లో పెద్ద ఊచకోత జరిగింది.
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్ని చెల్లించబోతోంది.
Gaming addiction: మొబైల్, ట్యాబ్‌లలో ఆన్లైన్ గేమింగ్‌కి బానిసలుగా మారుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ యువత ఈ పబ్జీ వంటి గేమ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇలా, గేమింగ్ వ్యసనం వల్ల ఎంతటి అనర్థాలు వస్తాయో, ఢిల్లీలోని 19 ఏళ్ల యువకుడి ఘటన చూస్తే అందరికి అర్థమవుతుంది. రోజులో 12 గంటల పాటు పబ్జీ గేమ్ ఆడుతూ, గేమింగ్‌కి వ్యసనంలో మునగడం వల్ల ఒక సదరు టీనేజర్ ‘‘పాక్షిక పక్షవాతానికి’’ గురయ్యాడు. చివరకు వెన్నెముకకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
Pahalgam Terror Attack: 26 మంది టూరిస్టుల్ని బలితీసుకున్న పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు చెన్నై మీదుగా శ్రీలంకుకు చేరుకున్నారని భారత్ నుంచి వచ్చిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం కొలంబో విమానాశ్రయంలో భారీ తనిఖీలు జరిగాయి. ఉదయం 11.59 గంటలకు కొలంబోలోని బండరానాయకే అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న శ్రీలంక ఎయిర్ లైన్స్‌కి చెందిన UL122 విమానాన్ని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
Australia: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్‌కి చెందిన లెఫ్ట్ భావజాలం కలిగిన లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్థానిక మీడియా అంచనా వేస్తోంది. శనివారం సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా అల్బనీస్ పార్టీ వెళ్తున్నట్లు మీడియా సంస్థలు తెలిపాయి.
Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
Pirate attack: తమిళనాడు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన పైరెట్స్(సముద్రపు దొంగలు) దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లు శుక్రవారం కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా దాడి జరిగినట్లు చెప్పారు.
BJP: పహల్గామ్ దాడి తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పటికే, కొందరు నేతలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు ‘‘హిందువులు’’ అని అడిగి చంపలేదు అని అన్నారు. తాజాగా, పంజాబ్ మాజీ సీఎం, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న చరణ్‌జీత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శనివారం, బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భారత సాయుధ దళాలను నిరాశ పరుస్తోందని, తమ రాజకీయ ప్రకటనల ద్వారా…
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కి భారత్ చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌ని ఎలా దెబ్బతీస్తే ఆ దేశం పతనమవుతుందో అలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే, పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు నదికి సంబంధించిన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ రాజకీయ నేతలు, సెలబ్రెటీలు, సినీయాక్టర్ల ఇన్‌స్టా అకౌంట్లు, యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది. పాక్ మీడియా, వెబ్సైట్లను నిషేధించింది. ఇదే కాకుండా, పాక్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని నిషేధించింది