Israeli PM Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్నారు. అయితే, ఆయన పర్యటన వాయిదా పడిందంటూ ఇజ్రాయిల్ మీడియా కథనాలను వెల్లడించింది. ఢిల్లీ ఉగ్ర దాడి నేపథ్యంలో, భద్రతా కారణాల రీత్యా నెతన్యాహూ పర్యటన వాయిదా పడినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
Pakistani Couple: పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఒక ప్రేమ జంట, భారత సరిహద్దు దాటి బీఎస్ఎఫ్కు పట్టుబడింది. పాకిస్తానీ వ్యక్తి, అతడి ప్రేమికురాలు ఇంటి నుంచి పారిపోయి కాలినడకన గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Missile test: బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నో-ఫ్లై జోన్ డిసెంబర్ 6న 12:30 UTC నుండి డిసెంబర్ 8న 15:30 UTC వరకు ఈ నో - ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వులు చెప్పాయి.
Pakistan-Bangladesh: గతేడాది హింసాత్మక విద్యార్థి అల్లర్ల తర్వాత, షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఈయన హయాంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం చిగురిస్తోంది.
Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది.
Delhi Car Blast: ఢిల్లీలో కార్ బాంబ్ ఘటన దేశాన్ని ఆందోళన పడేలా చేసింది. ఈ ‘‘వైట్ కాలర్’’ ఉగ్ర మాడ్యూల్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు బాంబు పేలుడుకు కారణమైన ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ, మిగతా తన ఉగ్రవాద అనుచరులకు పాలకుడిగా చెప్పుకునే వాడని, తనను తాను ‘‘ఎమిర్’’గా పిలుచుకునే వాడని తెలిసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది బుర్హాన్ వాని 2016లో భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. బుర్హాన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని ఉమర్ కోరుకునే వాడని…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
Tata Sierra: టాటా తన ఐకానిక్ సియెర్రాను(Tata Sierra) రంగ ప్రవేశం చేయించింది. ఆకట్టుకునే డిజైన్, మెరుగైన ఫీచర్లతో ప్రత్యర్థి కార్ మేకర్స్‌కి ఛాలెంజ్ విసురుతోంది. తక్కువ ధరలతో, ఎక్కువ ఫీచర్లు అందించే టాటా మరోసారి అదే చేసి చూపించింది.
Supreme Court: గురుద్వారాలో ప్రవేశించడానికి, పూజ చేయడానికి నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ అధికారిని తొలగించిన కేసును సుప్రీంకోర్టు విచారించింది. ‘‘అతను ఆర్మీకి పనికి రాడు’’ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. అతడిని అసమర్థుడిగా ముద్ర వేసింది. తన తొటి సిక్కు సైనికులు విశ్వాసాన్ని గౌరవించనందుకు అతడిని తొలగించిన ఆర్మీ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్‌కు కారణమైన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్‌నాగ్ మెడికల్ కాలేజీ(జీఎంసీ)లో పనిచేస్తున్నప్పుడు అతడి విపరీత ప్రవర్తనను గురించి సిబ్బంది గుర్తు చేసుకున్నారు.