India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను […]
26/11 Mumbai Attack: 26/11 ముంబై దాడులను ఈ దేశం ఎప్పుడూ మరిచిపోదు. ఈ దాడి జరిగి నేటికి 17 ఏళ్లు. లష్కరే తోయిబాకు చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 175 మంది మరణించారు.
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఆయనను పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసిందనే వార్తలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు.
Rare Earth Magnets: రేర్-ఎర్త్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు(REPMలు) తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఒక కొత్త పథకాన్ని ఆమోదించింది.
Al Falah University: ఢిల్లీ కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. ఈ వర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్లు ‘‘వైట్ కాలర్’’ టెర్రర్ మాడ్యూల్‌కి పనిచేశారు. ఎర్రకోట వద్ద కార్ బాంబుతో ఆత్మాహుతి చేసుకున్న బాంబర్ ఉమర్ కూడా ఈ వర్సిటీలో డాక్టర్‌గా పనిచేస్తున్నట్లు తేలడంతో ఒక్కసారిగా అల్ ఫలాహ్ పేరు మార్మోగింది.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో మరణించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరీమణులు, ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసినందుకు తమను పోలీసులు క్రూరంగా అణిచివేసినట్లు ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ – నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్లు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్న రావల్పిండిలోని అడియాల జైలు వెలుపల, ఆయన పార్టీ మద్దతుదారులతో […]
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది.
BrahMos: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత ‘‘బ్రహ్మోస్’’ క్షిపణి పాకిస్తాన్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, నితీష్ కుమార్ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవికి షాక్ ఇచ్చింది.