Tesla: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’(Tesla) భారత్‌లో తన సత్తా చాటలేకపోతోంది. సగటు భారతీయులు ఈ కార్లను కొనేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టమవుతోంది. భారత మార్కెట్లో టెస్లాకు అంత ఈజీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. 2025లో టెస్లా ఇండియాలోకి ప్రవేశించింది. తన మోడల్ Y(Model Y)ని విక్రయిస్తోంది. అయితే, వీటి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి.
Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ‘‘కుక్క’’ను తీసుకురావడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రేణుకా చౌదరికి మద్దతు ఇచ్చారు. ‘‘పార్లమెంట్‌కు కుక్కల్ని అనుమతించరా.?’’ అని వ్యంగ్యంగా మాట్లాడారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ‘‘ప్రాణాలతోనే’’ ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా పాక్ వ్యాప్తంగా ఇమ్రాన్ మరణించారని, ఆయనను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
Pakistan: సహాయంలో కూడా దాయాది దేశం పాకిస్తాన్ నీచంగా ప్రవర్తించింది. గడువు తీరిన సహాయ సామాగ్రిని అందించి, తన బుద్ధి ఏంటో మరోసారి నిరూపించుకుంది. దిత్వా తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిని శ్రీలంకు సాయం చేస్తున్నామని చెబుతూ పాకిస్తాన్ హైకమిషన్ సహాయ ప్యాకేజీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వాటిపై ఎక్స్పైరీ డేట్ 10/2024గా ఉంది. దీంతో పాకిస్తాన్‌పై విమర్శలు వాన మొదలైంది. గడువు తీరిన ఆహారాన్ని అందించడంపై పాక్ వైఖరిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
Imran Khan: గత కొంత కాలంగా పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలపై రావల్పిండిలోని అడియాలా జైలులో గత మూడేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆచూకీ గత నాలుగు వారాలుగా కనిపించలేదు. ఆయనను కలిసేందుకు ఆయన చెల్లెళ్లను, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రికి కూడా అనుమతించకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. పీ
CJI Surya Kant: తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు.
Funny Incident: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, ‘‘ఫస్ట్ నైట్’’ రోజే అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. ఈ పరిణామం వరుడి కుటుంబీకులను ఆందోళనకు గురి చేసింది. వివాహం అయిన రోజే అదృశ్యం కావడంతో వారంతా భయపడిపోయారు. మొహిసిన్ అనే వ్యక్తికి 5 రోజుల క్రితం ముజఫర్ నగర్ లో వివాహం జరిగింది. పెళ్లి రాత్రి, అతడి భార్య గదిలో వేచి చూస్తూ ఉంది. అయితే, గది […]
S-500 Prometheus: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య రక్షణ, ఇంధనం రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అధునాతన S-500 ప్రోమేతియస్ క్షిపణి వ్యవస్థ
PMO Rename: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. వలసవాద పాలన అవశేషాలు కూడా మిగలకుండా పలు నిర్ణయాలను తీసుకుంది. తాజాగా ఢిల్లీలోని కొత్త ప్రధాని భవన సముదాయం పేరును మార్చారు. పీఎంఓ పేరును ‘‘సేవా తీర్థ్’’గా మార్చారు. ఇటీవల, గవర్నర్ల అధికార నివాసమైన రాజ్ భవన్ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చారు.
Rameshwaram Cafe: బెంగళూర్‌లోని ప్రముఖ రెస్టారెంట్ అయిన రామేశ్వరం కేఫ్ ఓనర్లపై కేసు నమోదైంది. నిఖిల్ అనే ప్రయాణికుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కల్తీ ఆహారం, తప్పుడు బెదిరింపులు కేసు పెట్టినందుకు దాని యజమానులు రాఘవేంద్ర రావు, దివ్య రాఘవేంద్ర రావులతో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సుమంత్ లక్ష్మీ నారాయణలపై కేసు నమోదైంది.