Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని హతమార్చారు. దీనికి ప్రతిగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కార్యాలయాలపై భీకరదాడులు చేసింది.
Chips Packet: చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్లు కొనిపెట్టడం సహజం. కొనాలని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన హెచ్చరించింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్లో వచ్చిన మినియేచర్ బొమ్మను మింగడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు.
Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఖలీలూర్ రెహమాన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌ను కలిశారు. షేక్ హసీనాను అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన ఈ సమయంలో అజిత్ దోవల్ ఢాకాలో పర్యటించాల్సిందిగా రెహమాన్ ఆహ్వానించారు. కొలంబో భద్రతా కాన్క్లేవ్ యొక్క 7వ NSA సమావేశంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.
Anmol Bishnoi: ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను బుధవారం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ 11 రోజుల కస్టడీకి పంపింది. అమెరికా నుంచి బహిష్కరించబడిన తర్వాత ఫెడరల్ ఏజెన్సీ అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, అన్మోల్ని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గట్టి భద్రత మధ్య ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచింది.
Darshan Case: హత్య నేరంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ దర్శన్ తనకు దుప్పటి కావాలని కోర్టును కోరాడు. బుధవారం బెంగళూరులోని ట్రయల్ కోర్టులో అదనపు దుప్పటి కోసం విన్నవించుకున్నాడు. చలి కారణంగా తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. విచారణ ప్రక్రియ కోసం దర్శన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు.
Omar Abdullah: కొంత మంది చేసిన ఉగ్రవాద చర్యలు కాశ్మీర్ లోయలోని నివాసితులందర్ని కించపరుస్తున్నాయని, అందరూ అనుమానిస్తున్నారని, కాశ్మీర్ నుంచి బయటకు వెళ్లిన వారితో మాట్లాడేందుకు చాలా మంది దూరంగా ఉంటున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది.
Pakistan: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది ప్రపంచానికి తెలుసు. ఇటీవల, ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ వెనక కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లు మన భద్రతా ఏజెన్సీలు తేల్చాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు పాకిస్తానీ లీడర్ చౌదరి అన్వరుల్ హక్ కూడా తాము ఉగ్రవాదానికి పాల్పడుతున్నామని బహిరంగంగా ఒప్పుకున్నాడు.
Zoho's Sridhar Vembu: జోహో సహ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యువతకు ఆయన పెళ్లి గురించి సూచిస్తూ.. ‘‘ పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లల్ని కనండి’’ అని సలహా ఇచ్చారు. యువకులు సమాజానికి, మన పూర్వికుల పట్ల వారి జనాభా విధిని నేరవేర్చడానికి వివాహం చేసుకోవాలని ఆయన చెప్పారు.