Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివ్ అయిపోయారు. ఇప్పటికే పలువురు భారత్ వ్యతిరేక టెర్రరిస్టుల్ని హతమారుస్తున్న వీరు, తాజాగా లష్కరే తోయిబా టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్‌ని హతమార్చారు. పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లో ఇతడిని హతమార్చారు. భారత్‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. మూడు ప్రధాన దాడుల్లో ఖలీద్ కీలక కుట్రదారుగా ఉన్నాడు.
Read Also: KCR: అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా
2001లో రాంపూర్ సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి, 2005లో బెంగలూర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దాడి, 2006లో నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడుల్లో కీలక నిందితుడు. ఐదేళ్ల వ్యవధిలో లష్కరే తోయిబా ఉగ్ర దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పో్యారు. సైఫుల్లా ఖలీద్ ‘‘వినోద్ కుమార్’’ అనే మారుపేరుతో చాలా ఏల్లు నేపాల్‌లో నివసించాడు. స్థానిక మహిళ నగ్మా బానును వివాహం కూడా చేసుకున్నాడు. నేపాల్ కేంద్రంగా ఇతను లష్కరే కార్యకలాపాలను కోఆర్డినేట్ చేశాడని, రెక్రూట్‌మెంట్, లాజిస్టిక్స్ సహాయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇటీవల, ఖలీద్ తన స్థావరాన్ని పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సు లోని బాదిన్ జిల్లాలోని మాట్లీకి మార్చాడు. ఇక్కడ అతను ఐక్యరాజ్యసమితి నిషేధించిన పాకిస్థానీ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా, దాని ప్రధాన సంస్థ జమాత్ ఉద్ దావా కోసం పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే, గత వారం, జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయి. ఆపరేషన్ కమాండర్ షాహిద్ కుట్టాయ్‌తో సహా ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల్ని కాశ్మీర్ షోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి.