Jyoti Malhotra: సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్. మంచిగానే ఆదాయం వస్తూ ఉంటుంది. అయినా కూడా, హర్యానాకు చెందిన యూట్యూబర్ శత్రుదేశం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయింది. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఆరుగురిని గూఢచర్యం చేస్తున్న కారణంగా ఈ రోజు అరెస్ట్ చేశారు. హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ప్రముఖ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న జ్యోతి మల్హోత్రా ఈ వ్యవహారంలో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్సు, అత్యధిక ఖనిజవనరులు కలిగిన బలూచిస్తాన్ సొంతదేశం కోసం పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల బలూచిస్తాన్ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కూడా ఆశ్రయించింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ఆర్మీ కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ హరోప్తో పాక్ సైన్యాన్ని వేటాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, క్వెట్టా, పంజ్‌గుర్, […]
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్‌ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషించడంలో పాకిస్తాన్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉందని అన్నారు. పాకిస్తాన్ మానవాళికి ముప్పుగా మారిందని విమర్శించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలకు తెలిసేలా 7 ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది.
India Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. భారత్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయి. భారత వాయు రక్షణ వ్యవస్థలు 600 కంటే ఎక్కువ పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్స్‌ని భారత్ మోహరించింది.
India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.
Shashi Tharoor: పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్రవాదం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎండగట్టడానికి భారత్ అఖిలపక్షంతో కూడి ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతు ఇస్తుందనే అంశాన్ని విదేశాలకు వీరు చెప్పనున్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ని ఎంపిక చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం థరూర్, కాంగ్రెస్ మధ్య విభేదాలను స్పష్టంగా చూపిస్తుంది.
Celebi: ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్‌కి వ్యతిరేకంగా టర్కీ, పాకిస్తాన్‌కి సహకరించింది. టర్కీష్ డ్రోన్లను పాక్‌కి అందించింది. వీటిని దాయాది దేశం భారత్‌పైకి దాడిలో ఉపయోగించింది. ఇదే కాకుండా ఈ డ్రోన్లు ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా పాకిస్తాన్ పంపించినట్లు వార్తలు వస్తున్నా్యి. అయితే, ఈ నిర్ణయంపై భారత్ టర్కీపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బాయ్‌కాట్ టర్కీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్‌ని వ్యాపారులు బ్యాన్ చేశారు. టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య…
అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌లోని రెండు ప్రధాన హిందూ ఆలయాలు చర్చనీయాంశంగా మారాయి. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లోని ‘‘హింగ్లాజ్ మాతా’’ ఆలయంపై ఆసక్తి నెలకొంది. హిందూ మతంలోని 51 శక్తి పీఠాల్లో హింగ్లాజ్ శక్తిపీఠ్ కూడా ఒకటి. బలూచిస్తాన్ ప్రావిన్సులోని మారుమూల కొండల్లో ఈ ఆలయం నెలకొని ఉంది. సింధ్, బ
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది.