BJP MP: యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. భారత సైనిక వివరాలతో పాటు పలు సున్నిత వివరాలను పాకిస్తాన్ అధికారులతో పంచుకుంది. దీనికి తోడు ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలోని ఓ అధికారితో అత్యంత సన్నిహిత సంబంధాలను ఉన్నట్లు తేలింది. ఈ అధికారిని భారత్ బహిష్కరించింది. పలు సందర్భాల్లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లి వచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైంది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో తప్పుడు సమాచారం, దుర్వినియోగానికి పాల్పడున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఆన్‌లైన్ కంటెంట్ ప్లేస్‌లో జవాబుదారీతనం కోసం ఒక ముఖ్యమైన పిలుపుగా అభివర్ణించారు. యూట్యూబర్లు, డిజిటల్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై అత్యవసర నియంత్రణ , పర్యవేక్షణ అవసరమని అన్నారు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 53 మంది!
క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్, పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ ప్రారంభమై, చాలా సందర్భాల్లో తప్పుడు సమాచారం, టార్గెటెడ్ వేధింపులు, రహస్య రాజకీయ ఎజెండా కోసం కొందరు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాక్ స్వేచ్ఛని ఒక కవచం కింద వాడుకుంటున్నారని చెప్పారు. చాందీని చౌక్ ఎంపీగా ఉన్న ఖండేల్వాల్ కంటెంట్ క్రియేటర్ల ప్రవర్తన నియంత్రించడానికి జాతీయ స్థాయిలో ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యతిరేక, పరువు నష్టం కలిగించే డిజిటల్ ప్రభావాన్ని అడ్డుకోవడం కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.
3.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు మరియు 1.33 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ మల్హోత్రా, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ పట్టుబడింది. ఈమెతో పాటు మొత్తం ఆరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆమె మొదటిసారిగా 2023లో పాకిస్తాన్ సందర్శించడానికి వీసా కోసం అఫ్లై చేసుకున్న సమయంలో పాక్ అధికారి ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడింది. దీని తర్వాత ఆమె రెండుసార్లు పాక్ వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి పాక్ తరుఫున గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు.