Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్థానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జ్యోతితో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం, హర్యానా హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఏజెంట్లలో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు పోలీస్ విచారణలో తేలింది. అయితే, రక్షణ సమాచారం పంచుకుందా..? లేదా.? అనేదానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Read Also: Russia: 11 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగార కోర్కెలు.. తొమ్మిదేళ్ల జైలు శిక్ష..
పహల్గామ్ పర్యటన రహస్యాలను, పాకిస్తాన్ ఈమెను ఆస్తిగా ఉపయోగించుకున్న కుట్ర బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు జ్యోతి కాశ్మీర్, పాకిస్తాన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. జ్యోతి చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయం లోని అధికారి ద్వారా జ్యోతి పాకిస్తాన్ లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టం. మాజీ ప్రధాని కూతురు, ఇప్పుడు పాక్ పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్న మరియం నవాజ్‌తో ఉన్న జ్యోతి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.
జ్యోతి తన ఆదాయం కన్నా విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెతో పాటు మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పాకిస్తాన్ ఇమేజ్ పెంచేలా కథనాన్ని సెట్ చేసినట్లు తేలింది. హిసార్ ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తమకు జ్యోతి గురించి సమాచారం అందిందని, ఆ తర్వాత నిఘా పెట్టామని, ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. ఆమెతో పాటు ఆమె సహచరులు పట్టుబడ్డారని, ప్రస్తుతం వీరికి 5 రోజుల రిమాండ్ ఉందని, విచారిస్తున్నామని చెప్పారు.
Hisar, Haryana: On the arrest of YouTuber Jyoti Malhotra for allegedly spying for Pakistan, SP Hisar Shashank Kumar Sawan says, "During the conflict, she was in contact with PIOs… Although she remained in touch with PIOs, she did not have any direct access to critical military… pic.twitter.com/N8Z5Fez4mh
— IANS (@ians_india) May 18, 2025