Jyoti Malhotra: పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయం దేశంలో సంచలనంగా మారింది. జ్యోతితో పాటు మరో 11 మంది పాక్ కోసం గుఢచర్యం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రా నుంచి విచారణ అధికారులు, నిఘా ఏజెన్సీలు కీలక విషయాలను రాబడుతున్నాయి. ఇప్పటికే, పాక్ హైకమిషన్‌లోని ఉద్యోగి డానిష్‌తో సంబంధాలు, పాక్ పర్యటనల గురించి, పాకిస్తాన్‌లో ఎవరెవరిని కలిశారు అనే విషయాలను ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించాయి.
Read Also: Murali Naik: తిరుచానూరు పద్మవతి అమ్మవారి కుంకుమతో వీరజవాన్ చిత్రపటం!
పాక్ తరుపున గూఢచర్యం చేసినట్లు జ్యోతి మల్హోత్రా అధికారుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతి చేసిన అనేక వీడియోలను యూఏఈకి చెందిన పాక్‌లో పనిచేస్తున్న ట్రావెల్ కంపెనీ స్పాన్సర్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు పాకిస్తాన్‌లో పనిచేయడానికి లైసెన్స్ కలిగి ఉన్న వీగో సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకు స్పాన్సర్లందరిని విశ్లేషిస్తోంది. ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జ్యోతికి ఈ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,32,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
సింగపూర్, దుబాయ్‌లో ఆఫీసులు ఉన్న వీగో పాకిస్తాన్‌లో ట్రావెన్ ఏజెన్సీ లైసెన్స్‌తో పనిచేస్తోంది. దీనికి అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నుంచి కూడా గుర్తింపు ఉంది. అయితే, వీగో పాకిస్తాన్ కి ఫండింగ్ ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, దాని కార్యకలాపాలు జ్యోతి వ్యవహారంతో హైలెట్ అయ్యాయి. ఇదిలా ఉండగా, 26 మంది పౌరులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో జ్యోతి పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.