India on Trump: “ట్రంప్ మాటల్లో నిజం లేదు”.. పాక్ కాల్పుల విరమణపై భారత్..
- ట్రంప్ వాదనల్ని కొట్టిపారేసిన భారత్..
- పాక్‌తో కాల్పుల విరమణ చర్చల్లో సుంకాల ప్రస్తావనే లేదు..
- స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India on Trump: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల ఏర్పాడ్డాయి. భారత దాడితో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, రెండు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత, ఆయన మరో వింత వాదన చేశారు. ‘‘యుద్ధం ముగించకుంటే సుంకాల పేరుతో బెదిరింపుతోనే అమెరికా మధ్యవర్తిగా భారత్-పాక్ మధ్య కాల్పులు విరమణ కుదిరింది’’ అని చెప్పాడు.
తమ సుంకాల బెదిరింపు రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సహాయపడిందని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం ముందు చెప్పింది. ట్రంప్ ప్రతిపాదించిన విస్తృత సుంకాలపై చట్టపరమైన ఎదురుదెబ్బ తగలకుండా ఉండటానికి అతడి అధికారులు కోర్టు ముందుకు చివరి ప్రయత్నంగా ఈ విషయాన్ని తీసుకువచ్చారు. “అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే ప్రతికూల తీర్పు భారతదేశం మరియు పాకిస్తాన్‌లు ట్రంప్ ఆఫర్ చెల్లుబాటును ప్రశ్నించేలా చేస్తుంది, ఇది మొత్తం ప్రాంతం యొక్క భద్రతకు మరియు లక్షలాది మంది జీవితాలకు ముప్పు కలిగిస్తుంది” అని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కోర్టుకు తెలిపారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
Read Also: DOST Phase-1: దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయింపు..సీట్ వచ్చిందా? చెక్ చేసుకోండి..
అయితే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన దానిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో చర్చల సందర్భంగా సుంకాల అంశం ప్రస్తావనకు రాలేదని భారత్ తన వైఖరిని గురువారం పునరుద్ఘాటించింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన పరిపాలన చెప్పినవంతా అబద్ధాలే అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరోక్షంగా చెప్పింది. ‘‘ఈ ప్రత్యేక అంశంపై భారత్ వైఖరిని వ్యక్తీకరించాం. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుండి మే 10న విరమణ సమయం వరకు, భారతదేశం మరియు అమెరికా మధ్య సంభాషణ జరిగింది. చర్చ సమయంలో సుంకాల అంశం ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు’’అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ దాడికి ప్రతీకారంగా, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాక్, పీవోకేలోని 09 ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం, భారత్ లోని మిలిటరీ, సివిల్ ఆస్తులపై దాడులకు తెగబడింది. దీనికి అంతే ధీటుగా భారత్ పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌లపై దాడులు నిర్వహించి ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!