Pakistan: బలూచిస్తాన్ ప్రజలకు పెరగనున్న కష్టాలు.. అణచివేతకు పాకిస్తాన్ కొత్త చట్టం..
- బలూచ్ ప్రజల అణిచివేతకు కొత్త చట్టం..
- బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణిచేందుకు పాకిస్తాన్ ప్లాన్..
- చట్టాన్ని వ్యతిరేకిస్తున్న హక్కుల సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా బలూచిస్తాన్ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థలు ఆయుధాలతో పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ ఉద్యమాలను అణచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించింది. జూన్ 4న బలూచిస్తాన్ అసెంబ్లీ ఉగ్రవాద నిరోధక (బలూచిస్తాన్ సవరణ) చట్టం 2025ను ఆమోదించింది. ఇది ఆ ప్రావిన్సులో పనిచేస్తున్న భద్రతా బలగాలకు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ఈ చట్టంపై హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు, పౌర సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ చట్టం ఈ ప్రాంతంలో అణచివేత, అశాంతిని మరింతగా పెంచుతుందని హెచ్చరించారు.
కొత్త చట్టం ఏం చెబుతోంది..?
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
ఈ చట్టం పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐతో సహా సైనిక, నిఘా సంస్థలు, ఎటువంటి అధికారిక అభియోగాలు దాఖలు చేయకుండా లేదా కోర్టులో హాజరుపర్చకుండా 90 రోజుల వరకు వ్యక్తుల్ని నిర్భంధించేందుకు అనుమతిస్తుంది. అనుమానం ఉంటే చాలు ఆ వ్యక్తుల్ని ఖైదు చేయవచ్చు. న్యాయ ప్రక్రియ జోక్యం చేసుకోకుండా చట్టాన్ని రూపొందించారు. సోదాలు, ఆస్తుల్ని జప్తు చేయడానికి ముందస్తు న్యాయ అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
వివాదాస్పదంగా బిల్లు..
ఈ చట్టం సివిల్ పోలీసింగ్, సైనిక కార్యకలాపాల మధ్య అధికార పరిమితుల్ని చెరిపివేస్తుంది. ముఖ్యంగా బలూచ్ జనాభాను లక్ష్యంగా చేసుకుని సామూహిక నిఘా, అణచివేతకు మార్గం సుగమం చేస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ మరియు స్థానిక వాచ్‌డాగ్‌లు వంటి మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని ఖండించాయి. ఇది రాజ్యాంగ రక్షణల్ని, అంతర్జాతీయ చట్టాలను, పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 10ని ఉల్లంఘిస్తుంది.
ఇప్పటికే బెలూచిస్తాన్‌లో అపహరణలు..
స్వాతంత్ర్యం, హక్కుల కోసం నినదిస్తున్న బలూచ్ ప్రజల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ అపహరిస్తుంది. చాలా మంది కనిపించకుండా పోయారు. వారు ఎక్కడ ఉన్నారనే విషయాలు కూడా తెలియడం లేదు. తప్పిపోయిన వారిలో కొందరు 15-20 ఏళ్లుగా కనిపించలేదు. కొత్త చట్టం ఇప్పుడు ఈ అపహరణాల్ని చట్టబద్ధం చేసింది. చైనాలో ఉయ్‌ఘర్ ముస్లింలపై ఎలా అణచివేత కొనసాగుతుందో, ఇప్పుడు బలూచిస్తాన్‌లో అదే విధంగా ప్రజలపై దారుణాలు సాగుతాయి.
చట్టాన్ని సమర్థిస్తున్న పాక్..
ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడం అవసరమని వాదిస్తూ ప్రభుత్వం చట్టాన్ని సమర్థించింది. ఈ బిల్లు రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, చట్టాన్ని గౌరవించే పౌరులు భయపడాల్సిన అవసరం లేదని ఒక ప్రాంతీయ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!