Ahmedabad plane crash: ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఘోర విమాన ప్రమాదం అహ్మదాబాద్‌లో సంభవించింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా చనిపోయినట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ కాగానే, పైలట్ ఏటీసీకి ‘‘మేడే’’ అంటూ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఏటీసీ రెస్పాండ్ అయ్యే లూపే విమానం కూలిపోయింది. చనిపోయిన వారిలో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమానం టేకాఫ్ అయ్యేందుకు కష్టపడుతున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి. విమానం టేకాఫ్ అయిన సెకన్ల లోపే కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నేలను ఢీకొట్టిన తర్వాత పెద్ద శబ్ధంతో పేలిపోయింది. మంటలు చెలరేగడం వీడియోలో చూడవచ్చు.
CCTV video 🚨
सीसीटीवी वीडियो एयर इंडिया 171 के उड़ान भरने से लेकर दुर्घटना तक के अंतिम क्षणों को कैद किया।#planecrash #अहमदाबाद #AhmedabadPlaneCrash pic.twitter.com/IbGAaECvk5
— Chaman kumar patel (@Chamankumarpat2) June 12, 2025