Israel Iran War: ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’పేరుతో ఇరాన్‌పై భీకరమైన వైమానిక దాడులు చేస్తో్ంది. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఉదయం నుంచి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు మరణించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణతో మరోసారి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి.
Read Also: Air India plane crash: విమానం చివరి క్షణాల్లో పైలట్లు ఏం చేసి ఉండొచ్చు..?
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో భారతదేశ పౌరులకు కీలక సలహా జారీ చేసింది. ‘‘ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇరాన్‌లోని అన్ని భారతీయ పౌరులు మరియు భారత సంతతికి చెందిన వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన కదలికలను నివారించాలని, రాయబార కార్యాలయం యొక్క సోషల్ మీడియా ఖాతాలను అనుసరించాలని మరియు స్థానిక అధికారుల సలహా మేరకు భద్రతా ప్రోటోకాల్‌లను పాటించాలని అభ్యర్థించారు’’ అని పేర్కొంది.