Bird Hit: అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న 242 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇలా ఎలా కూలిపోయిందనే దానిపై పలువురు వైమానిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also: Air India Flight Crash Live Updates : కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. 242 మంది మృతి!
మాజీ సీనియర్ పైటల్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ప్రకారం, ప్రాథమికి పక్షులు ఢీకొట్టడం వల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. టేకాఫ్ బాగానే ఉంది, ల్యాండింగ్ గేర్ పైకి లేపడానికి ముందే, విమానం కిందకు దిగుతున్నట్లు కనిపించింది. ఇది ఇంజన్ ఫెయిల్యూర్‌ని సూచిస్తోంది. విమానానికి లిఫ్ట్‌కు కావాల్సిన శక్తి లేకపోవడం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. అయితే, దర్యాప్తు తర్వాతే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని అన్నారు. వైరల్ అవుతున్న ఫుటేజ్ ప్రకారం, టేకాఫ్ అసమానంగా జరిగినట్లు కనిపిస్తోంది. విమానం అనియంత్రితంగా కిందకు వచ్చింది, దీంతో పైలట్ మేడే కాల్ చేసినట్లు తెలుస్తోందని ఆయన చెప్పారు.
విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. విమానం టేకాఫ్ అయ్యే శక్తి లేకపోవడం ప్రమాదానికి కారణంగా కనిపిస్తోందని, టేకాఫ్ సమయంలో పక్షలు ఢీకొట్టి ఉంటే, ఇదే జరిగితే 6-7 నిమిషాల తర్వాత పడిపోవడం ప్రారంభమై ఉండొచ్చని అంచనా వేశారు. ఇది చాలా కొత్త విమానం అని చెబుతూనే, 11 ఏళ్ల విమానం కాబట్టి సాంకేతిక సమస్యలు ఉండే అవకాశాలు తక్కువగా అని చెప్పారు.