Venu Goapl Reddy
Author- NTV Telugu-
Assam: అత్యాచార నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తులు
Rape accused beaten to death by mob after fleeing custody:అత్యాచారం కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టిచంపారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ లోని గిలమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలకిలి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు బారువా అలియాస్ గెర్జాయ్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్లిన క్రమంలో తప్పించుకున్నాడు. అయితే కిలకిల గ్రామంలోని ఓ వాగు దగ్గర దాక్కుని ఉండడాని గమనించారు కొంతమంది గ్రామస్తులు. అయితే పట్టుకున్న… -
Naegleria Fowleri Infection: ‘మెదడును తినే అమీబా’.. అమెరికాలో ఒకరు మృతి.. ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. లక్షణాలేంటి..?
Naegleria Fowleri Infection: ప్రపంచంలో కొత్తకొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. చైనా వూహాన్ నగరంలో ప్రారంభం అయిన కోవిడ్ 19 వ్యాధి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. చాలా దేశాలు కోవిడ్ తో ఆర్థికమాంద్యం పరిస్థితుల్లోకి వెళ్లాయి. ఇక ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో మరో వ్యాధి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఇప్పటికే 92 దేశాల్లోకి ఈ వ్యాధి పాకింది. 35 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎక్కువగా యూరప్ దేశాలు, అమెరికాలోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. -
Coins Missing From An SBI: ఎస్బీఐ నుంచి కోట్ల విలువైన నాణేలు మిస్సింగ్.. సీబీఐ సోదాలు
Coins Missing From An SBI, CBI Searches: సొంతింటికే కన్నాలు వేశారు అధికారులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బిఐ) నుంచి రూ. 11 కోట్ల విలువైన నాణేలు మాయం అయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్ కరౌలీ ఎస్బిఐ బ్రాంచ్ లో 2021లో జరిగింది. అయితే ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తోంది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాాల మేరకు ఈ మిస్సింగ్ కేసులో ఏప్రిల్ 13న సీబీఐ కేసు నమోదు చేసింది. -
First Electric Double-Decker Bus: ఇండియాలో తొలి ఈవీ డబుల్ డెక్కర్ బస్.. ఆవిష్కరించిన గడ్కరీ
తాజాా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ముంబైలో భారత మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పుల్లీ ఎయిర్ కండిషన్డ్ బస్సును ఆవిష్కరించారు. బృహత్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) కొత్తగా కొనుగోలు చేసిన ఈవీ డబుల్ డెక్కర్ బస్సును గడ్కరీ ఆవిష్కరించారు. దశల వారీగా మరికొన్ని బస్సులు 2023 నాటికి ముంబై మహానగరం రోడ్లపైకి రానున్నాయి. ‘‘సుస్థిరమైన విప్లవానికి నాంది.. ఈ రోజు ముంబైలో అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ ను ప్రారంభించడం… -
Rahul Gandhi: ఇలాంటి రాజకీయాలు చేయడానికి ప్రధాని మోదీకి సిగ్గు లేదా..?
Rahul Gandhi criticizes PM Narendra Modi: 2002లో గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేయడంతో పాటు మరో ఏడుగురిని చంపిన కేసులో నిందితులను విడుదల చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ, గుజరాత్ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పటికే వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శించారు. -
Suvendu Adhikari: బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పాలన ఆరు నెలలు కూడా ఉండదు..
Suvendu Adhikari comments on TMC government: బీజేపీ నేత సువేందు అధికారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలులు కూడా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అధికార టీఎంసీ ‘ కొత్త, సంస్కరించిన టీఎంసీ’ ఆరు నెలల్లో వస్తుందని పోస్టర్లు వేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
Mehbooba Mufti: బీజేపీ కాశ్మీర్ ని ప్రయోగశాల చేసింది.. ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోంది.
Mehbooba Mufti criticizes BJP: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పీడీపీ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ గురువారం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో స్థానికులను నిర్వీర్యం చేయడానికి బీజేపీ పార్టీ ఇజ్రాయిల్ తరహా విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు. స్థానికేతరులకు ఓటు కల్పించడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఎన్నికల్లో బీజేపీ గెలిచే కుట్రగా అభివర్ణించారు. కాశ్మీర్ లో పడే ప్రతీ రక్తపు చుక్కను బీజేపీ క్యాష్ చేసుకుంటోందని విమర్శించారు. బీజేపీ వారు దేశాన్ని హిందూ దేశంగా కాకుండా.. బీజేపీ… -
Donald Trump’s 2020 India Visit: ట్రంప్ పర్యటనకు ఇండియా పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా..?
Donald Trump's 2020 India Visit: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను అధికారంలో ఉన్నప్పుడు 2020లో మొదటిసారిగా ఇండియాలో సందర్శించారు. దాదాపుగా 36 గంటల పాటు ఇండియాలో గడిపారు ట్రంప్. ట్రంప్ తో పాటు ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ అయిన మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్లతో పాటు అమెరికా ఉన్నతాధికారులు ఇండియాలో పర్యటించారు. 2020 ఫిబ్రవరి 24-25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీల్లో ట్రంప్ పర్యటన సాగింది. -
Maharashtra: రాయ్‌గడ్ టెర్రర్ బోట్ కలకలం.. ముంబై తరహా దాడులు చేసేందుకు కుట్ర..?
Maharashtra Raigad terror boat stir: మహారాష్ట్ర రాయ్‌గడ్ లో అరేబియా తీరంలో రెండు పడవలు కలకలం సృష్టించాయి. పడవల్లో మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరేబియా తీరం హరహరేశ్వర్ తీరంలో ఈ రెండు పడవులను గుర్తించారు. బోట్ లో ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, మరికొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రాయ్‌గడ్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు పోలీసులు. -
Maruti Suzuki Alto K10: ఇండియన్ మార్కెట్ లోకి ఆల్టో కె10.. ధర, ఫీచర్లు ఇవే..
2022 Maruti Suzuki Alto K10: మారుతి సుజుకి మరో కారును ఇండియన్ మార్కెట్ లో గురువారం లాంచ్ చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో కారు ఒకటి. తాజాగా ఈ రోజు 2022 ఆల్టో కె 10 కారును విడుదల చేశారు. ఎక్స్ షోరూం ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతోంది. కొత్త ఆల్టో కె10 మారుతి సుజుకి ఫిప్త్ జనరేషన్ హార్ట్ టెక్ ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి తయారు చేశారు. ఎస్ ప్రెస్సో లోని…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?