Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
- సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+
- డిస్ప్లే బెజెల్‌లోనే ఫ్రంట్ కెమెరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామ్ సంగ్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్ ఆన్లైన్లో లీక్ కావడంతో టెక్ ప్రపంచంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన ఫ్రంట్ డిజైన్‌తో పాటు కొన్ని కీలక వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ టిప్‌స్టర్ @sammygurus షేర్ చేసిన సమాచారం ప్రకారం, సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫ్రంట్ డిజైన్ లీక్ అయింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ట్యాబ్ S12+తో పాటు గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా మోడల్‌ను కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
లీక్ ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ S12+ వై-ఫై వేరియంట్‌కు SM-X840 మోడల్ నంబర్ ఉండగా, 5G వేరియంట్‌కు SM-X846N మోడల్ నంబర్‌గా పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్లు ఇప్పటికే దక్షిణ కొరియాలో భద్రతా ధ్రువీకరణను పొందినట్లు తెలుస్తోంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
డిస్ప్లే బెజెల్‌లోనే ఫ్రంట్ కెమెరా
లీక్ అయిన చిత్రాల ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ S12+లో ఫ్రంట్ కెమెరాను డిస్ప్లే బెజెల్‌లోనే అమర్చినట్లు కనిపిస్తోంది. అయితే కెమెరా రిజల్యూషన్ లేదా ఇతర ఫోటోగ్రఫీ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇప్పటికే వెలువడిన పలు లీక్‌ల ప్రకారం, సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+లో శక్తివంతమైన 3nm MediaTek Dimensity 9500 ఆక్టా-కోర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులో 14.6 అంగుళాల పెద్ద డిస్ప్లే అందించే అవకాశముందని సమాచారం. భారీ స్క్రీన్‌తో ఈ ట్యాబ్లెట్ వినోదం, గేమింగ్, ప్రొఫెషనల్ పనులకు అనువుగా ఉండే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీ
ఈ ట్యాబ్లెట్లో 11,600mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండొచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. దీంతో ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది.
ఎప్పుడు లాంచ్ అయ్యే అవకాశం?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సామ్ సంగ్ 2026 సెప్టెంబర్ చివరి నాటికి గెలాక్సీ ట్యాబ్ S12+ను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26 FE మోడల్‌ను అక్టోబర్‌లో పరిచయం చేసే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే, సామ్ సంగ్ నుంచి ఇప్పటివరకు ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి లీక్ అయిన వివరాలను అధికారిక ధృవీకరణ వచ్చే వరకు పుకార్లుగానే పరిగణించాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!