Kolkata rape Case: కోల్‌కతా లా విద్యార్థిని అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరవకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా(31)కి అధికార టీఎంసీ పార్టీలో సంబంధం ఉంది. టీఎంసీ స్టూడెంట్ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
Crime: 45 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని వ్యక్తి, తనకు 18 ఎకరాలు ఉందని అయినా వధువు దొరకలేదని తన బాధను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహరాజ్‌కు చెప్పుకోవడం అతడి చావుకు కారణమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ, పార్ట్‌టైమ్ టీచర్, రైతుగా పనిచేస్తున్నారు. అయితే, అతను వధువు కోసం నిరాశ వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడంతో, అతడికి ఉన్న 18 ఎకరాలను కొట్టేయాలని మోసగాళ్లు ప్లాన్ చేశారు.
Bengaluru: బెంగళూర్‌లో ఓ చెత్త లారీలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. 30-35 ఏళ్లు ఉన్న మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో నింపి లారీలో విసిరేశారు. అయితే, ప్రస్తుతం మహిళ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపు కోసం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kolkata Rape Case: కోల్‌కతాలో లా విద్యార్థినిపై అత్యాచార ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో వర్గ విభేదాలకు తావిచ్చింది. పార్టీలోని కొందరు నేతలు ఈ సంఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఎమ్మ్యేల మదన్ మిత్రాలు వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ దూరంగా ఉంది. మరో ఎంపీ మహువా మోయిత్రా ఈ ప్రకటనలు ‘‘అసహ్యకరమైనవి’’ అని అభివర్ణించింది.
Jagdeep Dhankhar: రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘ సెక్యులర్’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తొలగించాలనే వాదన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే లేవనెత్తిన ఈ అంశాన్ని పలువురు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ఈ పదాలను తొలగించాలనే వాదనకు మద్దతు తెలిపారు.
Woman Kills Husband: దేశవ్యాప్తంగా మగాళ్లకు భద్రత లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయా..? అనే అనుమానం వచ్చేలా హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. దీనికి తాజాగా ఉదాహరణ, ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య. భార్య సోమన్ తన లవర్ రాజ్ కుష్వాహాతో ప్లాన్ చేసి హత్య చేసింది. తాజాగా, కర్ణాటకలో కూడా ఇలాంటి ఘోరమే మరోకటి జరిగింది. ఒక మహిళ […]
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లిన తొలి భారతీయుడిగా, అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రికార్డ్ క్రియేట్ చేశారు. శనివారం, శుక్లా ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడారు. ‘‘ఈ రోజు మీరు మన మాతృభూమికి దూరంగా ఉన్నారు. కానీ మీరు భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు’’ని మోడీ, శుక్లాను ప్రశంసించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో మాకు ఎలాంటి నష్టం కలగలేదని పాకిస్తాన్ బుకాయిస్తూ వస్తోంది. అయితే, భారత్ దాడిలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన చాలా ఆస్తులు నష్టపోయినట్లు వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఇండోనేషియన్ ఎయిర్ ఫోర్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సెమినార్లో పాకిస్తాన్ నష్టాల గురించి ప్రస్తావన వచ్చింది.
Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా, అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సొంతం చేసుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అయిన శుక్లాతో శనివారం ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు.