Kolkata rape Case: కోల్‌కతా లా విద్యార్థిని అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్జీకల్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరవకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా(31)కి అధికార టీఎంసీ పార్టీలో సంబంధం ఉంది. టీఎంసీ స్టూడెంట్ విభాగంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
Read Also: Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
అయితే, మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని పలువురు అతడి క్లాస్‌మెట్స్ చెబుతున్నారు. మహిళా స్టూడెంట్స్‌ని వేధించవడం, క్లా్స్‌మేట్స్‌పై దాడులు చేయడం వంటివి చేసేవాడని అతడితో చదివిన విద్యార్థులు చెబుతున్నారు. అధికార టీఎంసీ విద్యార్థి విభాగం తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) నాయకుడు కావడంతో స్థానిక పలుకుబడితో తప్పించుకునే వాడని వెల్లడించారు. 2013లో క్యాటరింగ్ పనివాడిని పొడిచి, వేళ్లు నరికిన కేసులో మోనోజిత్ పై హత్యాయత్నం కేసు నమైంది. ఆ తర్వాత కొన్ని ఏళ్ల పాటు అతను క్యాంపస్ నుంచి అదృశ్యమైనట్లు తెలిసింది.
కేసు సైలెంట్ అయిపోయిన తర్వాత 2016లో కాలేజీలో చేరాడు. 2017లో విద్యార్థి రాజకీయాల్లోకి తిరిగా రావడానికి ప్రయత్నించినప్పుడు, టీఎంసీ స్టూడెంట్ వింగ్ అతడిని తిరస్కరించింది. డిసెంబర్ 2017లో, మోనోజిత్ 30-40 మంది మద్దతుదారులతో క్యాంపస్‌లోకి చొరబడి, విద్యార్థి సంఘం సభ్యులపై దాడి చేసి, అల్లకల్లోలం సృష్టించినట్లు మాజీ విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపస్‌లో తరుచూ గొడవలు సృష్టించేవాడని తెలిసింది. ఇతడిపై మహిళలు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడేవారని వారు వెల్లడించారు. గతంలో కూడా ఒక మహిళను ఇలాగే వేధించాడని, అయితే బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో ఆ విషయం బయటపడలేదని మోనోజిత్‌తో చదివిని వ్యక్తి చెప్పాడు.