PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సౌత్‌లోని అనేక కీలక దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరించేందుకు జూలై 2 నుంచి 9 వరకు 5 దేశాల్లో పర్యటిస్తారు.
India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.
Rahul Gandhi: రాజ్యాంగ పీఠికలో ‘‘లౌకిక’’, ‘‘సోషలిస్ట్’’ పదాలను తీసేయాలని ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ఈ పదాలను కొనసాగించడంపై చర్చకు పిలుపునిచ్చిన తర్వాత ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
Matrimonial Fraud: మ్యాట్రిమోనీ సైట్లను నమ్ముకుని మోసపోతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తప్పుడు మాటలు చెప్పడం, మహిళల్ని నమ్మించడం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా పూణేకు చెందిన ఓ మహిళ రెండో వివాహం కోసం చూస్తే, ఆమెకు మొదటి భర్త ద్వారా వచ్చిన భరణం డబ్బుల్ని మోసపోవాల్సి వచ్చింది. మోసం చేసని వ్యక్తిని పూణే సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ రోహిత్ ఒబెరాయ్ అనే ఆస్త్రేలియా డాక్టర్‌గా నటిస్తూ, […]
Kolkata Student Case: కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో 24 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. నిందితుల్లో ఒకరు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విద్యార్థి విభాగం నేత కావడంతో ఈ కేసు రాజకీయంగా చర్చకు దారి తీసింది. గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పీజీ వైద్యురాలిపై అత్యాచార ఘటన మరిచిపోక ముందే ఈ సంఘటన జరిగింది.
Kerala High Court: కేంద్రమంత్రి, మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ నటించిన మళయాల సినిమా ‘‘JSK - జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’’లో ‘‘జానకి’’ పేరు ఉపయోగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పేరు ఉపయోగించడం ద్వారా మతపరమైన సెంటిమెంట్లు దెబ్బతింటాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కేరళ హైకోర్టు శుక్రవారం ప్రశ్నించింది.
Zohran Mamdani: భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసు ఉన్న ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధిస్తే, అమెరికాలో అతిపెద్ద నగరానికి తొలి ముస్లిం మేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. అయితే, గతంలో మమ్దానీ భారత్, భారత ప్రధాని నరేంద్రమోడీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారతీయులతో పాటు చాలా మంది అతడి కామెంట్స్‌ని తప్పుబడుతున్నారు.
Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయంలో ఎన్నో రహస్యాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రతీది దైవత్వాన్ని సూచిస్తుంది. ఒడిశాలోని పూరీలో ప్రస్తుతం జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పూరీకి చేరుకుంటారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆ దేశ రాజధానిలో దుర్గా మాత ఆలయాన్ని కూల్చివేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. మరోవైపు, బంగ్లాదేశ్ అధికారులు ఈ చర్యను సమర్థించారు. ఆలయం తాత్కాలిక నిర్మాణం అని, చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది. Read Also: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ […]