Venu Goapl Reddy
Author- NTV Telugu-
MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన అమిత్ షా.
Amit Shah started MBBS course in Hindi language: దేశ విద్యా వ్యవస్థలో చారిత్రక ఘట్టం మొదలైంది. తొలిసారిగా వైద్యవిద్యను హిందీ మాధ్యమంలో ప్రారంభించారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రధాని మోదీ కోరిక నెరవేరిందని ఆయన అన్నారు. భారతదేశ విద్యా రంగంలో ఇది కీలకమైన రోజని అమిత్ షా అన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజుగా దీన్ని అభివర్ణించారు. ఎంబీబీఎస్… -
Nihar Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించిన బాల్ ఠాక్రే మనవడు
Bal Thackeray's grandson supports CM Ek Nath Shinde: మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్ తగిలింది. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే మనవడు నిహార్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలిపాడు. త్వరలో జరిగే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ముంబై ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. నవంబర్ 3న జరుగుతున్న అంధేరీ ఉపఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీ నుంచి రుతుజా లట్కేను ఉద్ధవ్ ఠాక్రే పోటీలో నిలబెడుతుండగా.. ఏక్ నాథ్… -
Mexico: మెక్సికో బార్లో దుండగుడి కాల్పులు.. 12 మంది మృతి
Shooting in Mexico bar.. 12 people died: మెక్సికో దేశంలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక నెల లోపు రెండు కాల్పుల ఘటనలు జరిగాయి. మెక్సికోలోని ఇరాపుయాటోలోని ఓ బార్ లో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మొత్తం 12 మంది మరణించారు. ఇందులో ఆరుగురు మహిళల, ఆరుగురు మగవాళ్లు ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇరాపుటోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో మెక్సికోలో గన్ ఫైరింగ్స్ ఎక్కువయ్యాయి. -
Nirmala Sitharaman: రూపాయి పడిపోవడం లేదు.. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది.
Sitharaman's ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థతో… -
Bihar: బీహార్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
Boat capsizes in Bihar’s Katihar: బీహార్ రాష్ట్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం రోజున కతిహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది ఉంటే ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. పడవలో ఉన్నవారంతా రైతులే అని తెలుస్తోంది. -
Infosys: ఐటీ ఉద్యోగులకు మరోసారి నిరాశ.. కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ వాయిదా వేసిన ఇన్ఫోసిస్
Infosys delays onboarding date again: కొత్తగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేరాలనుకునే యువతకు మరోసారి నిరాశే ఎదురైంది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి కొత్త ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ తేదీని మరోసారి వాయిదా వేసింది. గత నాలుగు నెలలుగా కొత్త ఉద్యోగులు చేరికను వాయిదా వేస్తూ వస్తోంది ఇన్ఫోసిస్. మొదటిసారిగా సెప్టెంబర్ 12, 2022 చేరిక తేదీని నిర్ణయించారు. ఆ తరువాత ప్రస్తుతం డిసెంబర్ 19, 2022కు మార్చారు. గత నాలుగు నెలల్లో నాలుగు సార్లు ఆన్‌బోర్డింగ్ తేదీని వాయిదా వేసింది. -
PM Narendra Modi: ప్రధాని చేతుల మీదుగా డీబీయూల ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోదీ
PM Modi to launch 75 digital banking units across 75 districts: దేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రజలకు మరింతగా చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రోజున 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను(డీబీయూ) ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న డీబీయూలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. -
China: ప్రారంభం అయిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ సమావేశాలు.. మూడోసారి అధ్యక్ష పీఠం కైవసం దిశగా జిన్‌పింగ్
Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్… -
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో వాహనం నలిగిపోవడం వల్ల… -
Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!