Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Job Calendar: ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ రూపకల్పన ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించి నియామకాల విధివిధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్లు, ఈ-హెచ్ఆర్ఎం ప్రక్రియ పూర్తి చేయడం, స్థానిక కేడర్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే కొత్త స్థానిక కేడర్లలో పోస్టుల కేటాయింపు, సీనియారిటీ జాబితాల ఖరారు, రోస్టర్ల ప్రారంభం, అభ్యర్థుల కేటాయింపు, నియామక సంస్థలకు ఇండెంట్లు పంపడం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.
సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎస్. రావత్, బి. రాజశేఖర్, కృష్ణబాబు, జి. జయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే రెండో దశ జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం విదితమే.. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ అప్పట్లో ఎక్స్‌లో పేర్కొంటూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇక, ఇప్పుడు రెండో దశ జాబ్ క్యాలెండర్ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!