Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Narendra Modi: దేవాలయాల సందర్శనకు వెళ్లనున్న ప్రధాని మోదీ..
Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మోదీ. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు. -
5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
5G India Rollout: దేశంలో అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మొదటి విడతలో 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దశల వారీగా మరిన్ని నగరాల్లో ఈ సేవలను అందించేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మార్చి, 2023 నాటికల్లా దేశంలోని 200 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. -
Bharat Jodo Yatra: “భారత్ జోడో యాత్ర”లో పాల్గొనాలని ఉద్ధవ్, శరద్ పవార్లకు కాంగ్రెస్ ఆహ్వానం
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారమే లక్ష్యంగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటకలో పూర్తైంది. తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది. దీని తర్వాత నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. -
Interpol General Assembly: దావూద్ ఇబ్రహీంను భారత్‌కి అప్పగిస్తారా..? పాక్ అధికారుల రియాక్షన్ ఇదే..
Pakistani authorities' silence on Dawood Ibrahim's hand over To India: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో పాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అప్పగింతపై పాకిస్తాన్ అధికారులు సమాధానం దాటవేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ కార్యక్రమానికి పాకిస్తాన్ తమ దేశం తరుపున ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసీన్ భట్ ను పంపింది. ఇద్దరు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. -
Khalistan slogans: “ఖలిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేసిన పంజాబ్ ఎంపీ అనుచరులు
MP's followers raised slogans of Khalistan: పంజాబ్ రాష్ట్రంలో నెమ్మదిగా ఖలిస్తానీ ఉగ్రవాదులు వేర్పాటువాద బీజాలు నాటుతున్నారు. ప్రస్తుతం ఏకంగా భారతదేశ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న వ్యక్తి అనుచరులే ఖలిస్తాన్ కు మద్దతుగా ‘‘ ఖలిస్తాన్ జిందాబాద్’’ అని నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శిరోమణి అకాలీదళ్(ఏ) అధ్యక్షుడు, పంజాబ్ సంగ్రూర్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు తిరస్కరించడంతో సోమవారం రాత్రి ఆయన మద్దతుదారులు ఈ చర్యకు పాల్పడ్డారు. అధికారులు ఎంపీ మాన్ జమ్మూకాశ్మీర్ లోకి… -
Punjab: భార్య నిరాకరించడంతో భర్త దారుణం.. ఐదుగురి హత్య
Husband burned his wife and children alive in punjab: పచ్చని సంసారాన్ని క్షణికావేశం బుగ్గి చేసింది. భార్య, భర్తల మధ్య గొడవ ఐదుగురి మరణాలకు కారణం అయింది. భార్య తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ భర్త వద్దకు తిరిగి రావడానికి నిరాకరించడంతో భర్త ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి భార్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులను సజీవ దహనం… -
Govt raises MSP: రైతులకు గుడ్ న్యూస్.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు
Govt raises MSP on wheat by Rs 110: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు గానూ.. 6 పంటలకు మద్దతు ధరలను పెంచింది. గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 110 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ. 2,125కు చేరింది. ఇదే విధంగా అవాలకు రూ.400… -
Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
Man dies while dancing in Gujarat's Dahod: డాన్స్ చేస్తున్న మరో వ్యక్తి గుండె ఆగింది. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు దేశంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. తాజా మరోసారి ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దేవ్‌గఢ్ బరియా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. -
Uttarakhand: కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ క్రాష్.. ఏడుగురు మృతి
elicoptor crashes near Uttarakhand's Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్ నాథ్ కు రెండు కిలోమీటర్ల దూరంలో గరుడ్ చట్టిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ తో సహా మొత్తం ఏడుగురు మరణించారు. గుప్తకాశీ నుంచి కేదార్ నాథ్ వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం, వాతావరణ కారణాల వల్ల హెలికాప్టర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఏవియేషన్ హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేదార్ నాథ్ కు వెళ్తోంది. హెలికాప్టర్ కూలిన వెంటనే మంటలు… -
Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు.. “సత్యమేవ జయతే” అంటూ సిసోడియా ట్వీట్
Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిలీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి. ఇప్పటికే కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!