Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Facts: ఎడారిలో ఒంటె నోరు బలవంతంగా తెరిచి అందులో ఒక బతికున్న పామును వేస్తున్న సీన్ చూస్తే ఎవరైనా ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. శాకాహార జంతువైన ఒంటెకు పామును ఎందుకు తినిపిస్తున్నారు? అది కూడా విషపూరితమైన కింగ్ కోబ్రాను కూడా నోట్లో ఎందుకు వేస్తారనే ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది నోట వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ ప్రశ్నలను మరింతగా తెరపైకి తీసుకొచ్చాయి. అరబ్ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఇది వైద్యపరమైన చికిత్సేనా? లేక స్థానిక విశ్వాసమా? అనే సందేహాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి.
అయితే అరబ్ దేశాలలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఒంటెలకు ‘హయామ్’ అనే వ్యాధి వస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ వ్యాధి బారిన పడిన ఒంటె క్రమంగా ఆహారం, నీరు తీసుకోవడం తగ్గించి బాగా బలహీనంగా తయ్యారవుతుందిని చెబుతారు. శరీరంలో నీరసం, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని, సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చని స్థానిక విశ్వాసం. ముఖ్యంగా గర్భిణీ ఒంటెల్లో ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారి గర్భస్రావం, మరణానికి దారితీయొచ్చని కూడా భావిస్తుంటారు.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
ఈ వ్యాధికి చికిత్సగా కొందరు ఇప్పటికీ ఒక పురాతన పద్ధతిని అనుసరిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ఒంటె నోరు తెరిచి అందులో బతికున్న పామును వదిలేస్తారు. కొన్ని సందర్భాల్లో కింగ్ కోబ్రా వంటి విషపూరిత పాములను కూడా ఉపయోగిస్తారని ప్రచారం ఉంది. అనంతరం పాము కడుపులోకి వెళ్లేలా ఒంటెకు నీరు తాగిస్తారు. పాము విషం ఒంటె శరీరంలోని వ్యాధికారకాలను నాశనం చేస్తుందని, కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం మెరుగుపడుతుందని స్థానికులు విశ్వసిస్తారు. అయితే ఈ వాదనను సమర్థించే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు.
పశువైద్యులు మాత్రం ఈ విధానాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. హయామ్ అనే వ్యాధి ఇన్ఫెక్షన్లు, పరాన్నజీవులు, కీటకాల కుట్టడం వంటి కారణాలతో రావచ్చని వారు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పశువైద్య చికిత్స మాత్రమే సరైన మార్గమని స్పష్టం చేస్తున్నారు. బతికున్న పాములను తినిపించడం వల్ల వ్యాధి నయమవుతుందనే విషయాన్ని నిరూపించే పరిశోధనలు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం సంప్రదాయం కొనసాగుతోందనే కారణంతో దానిని వైద్యపరంగా సరైన చికిత్సగా పరిగణించలేమని హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ ఆచారం అరబ్ కంట్రీస్ లో వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. గతంలో ఈ విధానం వల్ల కొన్ని ఒంటెలు కోలుకున్నాయని స్థానికులు నమ్ముతుండటంతో ఆ విశ్వాసం ఇంకా కొనసాగుతోంది. కానీ శాస్త్రవేత్తల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఒక చికిత్స ప్రభావవంతమని చెప్పాలంటే శాస్త్రీయ పరీక్షలు, పరిశోధనలు, వైద్య ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇక ఒంటెల ఆహారం గురించి చూస్తే అవి పూర్తిగా శాకాహార జంతువులు. గడ్డి, ఆకులు, ఎడారి పొదలు, పూలు, పండ్లు వంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయి. అవి పాములను, ఇతర జంతువులను వేటాడవు. ఒంటెల మూపురంలో నీరు కాకుండా కొవ్వు నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు అదే శక్తిగా మారి ఎడారిలో రోజుల తరబడి ఆహారం, నీరు లేకున్నా జీవించేందుకు సహాయపడుతుంది. ఒక ఆరోగ్యవంతమైన ఒంటె ఒకేసారి సుమారు 100 నుంచి 150 లీటర్ల వరకు నీటిని తాగగలదు. దాదాపు ఏడు అడుగుల వరకు పెరిగే ఈ జంతువును అందుకే ఎడారి ఓడగా పిలుస్తారు.
ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో ఒంటె నోటిలో బతికున్న పామును వేస్తున్న వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలు ఎక్కడ నుంచి వచ్చాయి అనేది నిర్ధారణ కాలేదు. అందువల్ల అలాంటి వీడియోలను చూసి అవే నిజమని నమ్మకుండా, శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోవడం అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు.
- Tags
- Animal Facts
- Camel
- viral news
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!