Tripura: సీఎంగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన త్రిపురకు 11 ముఖ్యమంత్రి. శనివారం అనూహ్యంగా సీఎంగా ఉన్న బిప్లవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో… బీజేపీ శాసన సభ పక్షంగా కొత్త సీఎంగా మానిక్ సాహాను ఎన్నుకున్నారు. ఆదివారం రాజధాని అగర్తలతో గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య, మానిక్ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ సభ్యుడైన సాహాను అనూహ్యంగా సీఎం పదవి వరించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సాహా. 2016లో కాంగ్రెస్ ను వదిలి సాహా బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కీలకంగా మారారు.
గత రెండు రోజుల క్రితం మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ ఢిల్లీ వచ్చి అమిత్ షాను కలిశారు ఆ తరువాతి రోజు శనివారం బిప్లవ్ కుమార్ దేబ్ సీఎంగా రాజీనామా చేశారు. 25 ఏళ్ల వామపక్ష పాలను దించి బీజేపీ తొలిసారిగా త్రిపురలో అధికారాన్ని చేజిక్కించుకుంది. తరువాత బిప్లవ్ ను సీఎంగా చేసింది. అయితే 2023లో జరిగే ఎన్నికలకు ఏడాది ముందే బిప్లవ్ ను పదవి నుంచి తప్పించి మానిక్ సాహాకు పగ్గాలు అప్పగించారు.
Also Read
- Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
- Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
- RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
- Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
అయితే ఇటీవల కాలంలో త్రిపుర రాష్ట్రంలో త్రుణమూల్ కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ తో పాటు చిన్నా చితక పార్టీల నుంచి నేతలు త్రుణమూల్ లో చేరుతున్నారు. దీనికి తోడు త్రిపుర బీజేపీలో అసమ్మతి పోరును కరెక్ట్ గా హ్యండీల్ చేయలేదని బిప్లవ్ పై అధిష్టానం వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహాన్నే త్రిపురలో కూడా బీజేపీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఉత్తరాఖండ్ లో ముందున్న సీఎంను తప్పించి పుష్కర్ సింగ్ ధామికి పగ్గాలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంది. ఇదే ఫార్ములాను ఉపయోగించి ప్రజల్లో వ్యతిరేఖత లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది.
.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!