రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘నవ కల్పన్ శింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. వరస పరాజయాలను నుంచి బయటపడేందుకు పార్టీకి కొత్త రూపు సంతరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి బీజేపీ ‘ చింతన్ శిబిర్’ ను ప్రారంభించనుంది. 2022 ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ఈ చింతన్ శిబిర్ ను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు బీజేపీ చింతన్ శిబిర్ సాగనుంది. చింతన్ శిబిర్ 40 మంది నేతలతోనే జరుగుతుంది. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను చింతన్ శిబిర్ నుంచి దూరంగా ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
1998 నుంచి వరసగా గుజరాత్ లో బీజేపీనే అధికారం ఉంది. మరోసారి గుజరాత్ లో అధికారం చేజిక్కించుకునేలా వ్యూహాలు రచించేలా, పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా ఈ చింతన్ శిబిర్ సాగనుంది. ప్రతిపక్షాల విమర్శలుకు ధీటుగా సమాధానం ఇచ్చేలా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో అధినాయకత్వం చర్చించనుంది. ఈ చింతన్ శిబిర్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర మంత్రి, గుజరాత్ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దీంతో పాటు పాటీదార్ ఉద్యమ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న హర్ధిక్ పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్ధిక్ పటేల్ తో పాటు ప్రతిపక్ష నేత శైలేష్ పర్మార్ వంటి నేతలు బీజేపీతో టచ్ లో ఉన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీలోని ఓ వర్గం హర్ధిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకోవడానికి అనుకూలంగా లేదు. గుజరాత్ లోని 182 అసెంబ్లీ నియోజక వర్గాలకు గానూ… ఈసారి 150 సీట్లను గెలుచుకుని మాజీ సీఎం మాధవ్ సింగ్ సోలంకి 149 సీట్ల రికార్డును బద్ధలు కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ప్ర