కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు.
సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ప్రియంగార్డ్ కేవలం 24 బంతుల్లో 2 సిక్సులు, 4 ఫోర్ల సహాయంతో 42 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 44 బంతుల్లో మూడు సిక్సులు, 9 ఫోర్ల సహయంతో 76 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 22 బాల్స్ లో 38 రన్స్ చేశాడు.
సన్ రైజర్స్ బ్యాటర్ల ధాటికి ముంబై బౌలర్లు చాలా రన్స్ ఇచ్చారు. రణ్ దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా.. బూమ్రా, డెనియల్ సామ్ తలో వికెట్ తీశారు. ఒక్క రణ్ దీప్ సింగ్ తప్పా… మిగతా బౌలర్లందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు.