కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 26 మందికి గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. హుబ్లీ నగర శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు స్పాట్ లోనే మరణించారు. ప్రయాణికులతో బస్సు కోల్హాపూర్ నుంచి బెంగళూర్ […]
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. తన అరెస్ట్ అక్రమం అని అమరావతి ఎంపీ నవనీత్ రాణా మహారాష్ట్ర సర్కార్ తో పాటు సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు.తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారంటూ..పార్లమెంట్ సభ్యురాలిగా తన హక్కులకు భంగం కలిగిందంటూ నవనీత్ రాణా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీకి నవనీత్ రాణా ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆమెను తమ ముందు హాజరు కావాలంటూ […]
తక్కువ సయమంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలో తనకంటూ ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం టోక్యోలో జరిగిన క్వాడ్ సమ్మిట్ లో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో సమావేశం అయ్యారు మోదీ. ఇండో పసిఫిక్ రిజియన్ భద్రతపై నాలుగు దేశాధినేతలు చర్చించారు. క్వాడ్ పరిధివిస్తృతమైందని మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, మా సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని […]
శ్రీలంక ఆర్థిక కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైపు ఆహార కొరత, నిత్యావసరాల ధరలు పెరుగుతూ పోతుంటే.. మరో వైపు ఇంధన కష్టాలు శ్రీలంకను పట్టిపీడిస్తున్నాయి. దేశంలో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. పెట్రోల్, డిజిల్ కోసం జనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. పెట్రోల్ కోసం ప్రజల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన 1948 తరువాత శ్రీలంకలో ఎప్పుడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇదిలా ఉంటే శ్రీలంకలో మరోసారి […]
జ్ఞానవాపి మసీదు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 14-16 వరకు సర్వే జరిగింది. మసీదులోని వాజుఖానా ప్రదేశంలోని కొలనులో శివలింగం బయటపడిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలంటూ… అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించింది. ఇటీవల సుప్రీం కోర్ట్ ఈ వివాదంపై విచారణ జరిపింది. శివలింగం బయటపడిన ప్రాంతానికి రక్షణ కల్పించడంతో పాటు ముస్లింలు ప్రార్థన […]
జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 […]
కేంద్రం పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్రం పెట్రోల్, డిజిల్ పై బారాణా పెంచి చారాణా తగ్గించిందని విమర్శించారు. మార్చి 2014లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి మాట్లాడంటూ సవాల్ విసిరారు. ఎందుకోసం బీజేపీ నేతలు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదని అన్నారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని… డీజిల్, పెట్రోల్ తగ్గించినట్లు […]
వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో […]
దేశంలో యోగీ తరువాత బుల్డోజర్లను బాగా వాడుతుంది ఎవరంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఎదైనా ప్రభుత్వ వ్యతిరేఖ పనులకు పాల్పడ్డా… నేరాలకు పాల్పడ్డా నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ చూపించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అల్లరి మూకల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు అక్కడి అధికారులు. శనివారం అస్సాం నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టింది కొంతమంది అల్లరి మూక. పోలీస్ కస్టడీలో […]
మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా పుణేలో మార్చ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు రాజ్ ఠాక్రే. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించాలని మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. తాజాగా ఆదివారం పూణేలోని గణేష్ కళా క్రీడా మంచ్ లో భారీ […]