Road Accident: తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి..