జపాన్ వేదికగా మంగళవారం క్వాడ్ కూటమి కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లారు. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు క్వాడ్ కూటమి ఇండో- పసిఫిక్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, భద్రతపై ప్రధానంగా ఈ క్వాడ్ కూటమి ఏర్పడింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేలా ఈ నాలుగు దేశాల కూటమి ప్రధానం చర్చ సాగించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యంలో 30-40 శాతం ఇండో పసిఫిక్ రీజియన్ ద్వారానే జరుగుతోంది. దీంతో ఈ ప్రాంత భద్రతపై నాలుగు దేశాలు చర్చలు జరపనున్నాయి.
మంగళవారం టోక్యోలో జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కాననున్నారు. ఈ నాలుగు దేశాల అధినేతలు నాలుగోసారి సమావేశం అవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో వాషిింగ్టన్ వేదికగా కలుసుకున్నారు. ముఖ్యంగా చైనాను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే నేరుగా చైనా గురించి చర్చించకున్నా.. ప్రాంతీయ భద్రతపై మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ వంటి అంశాలు చర్చలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఫ్రీ ట్రేడ్ పై నాలుగు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే క్వాడ్ లోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు రష్య-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే ఇప్పటి వరకు రష్యా దాడిపై భారత్ నేరుగా స్పందించలేదు. కానీ ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని సూచించింది.
ముఖ్యంగా చైనా దురాక్రమణ.. ఇండో పసిఫిక్ రీజియన్ లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే భారత్ తో పాటు జపాన్ తో సరిహద్దు వివాదాలను రాజేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే చైనా, తైవాన్ ను ఆక్రమించుకునేందుకు సమాయత్తం అవుతుందనే సమాచారం వస్తున్న నేపథ్యంలో క్వాడ్ సమ్మిట్ లో దీనిపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జో బైడెన్ చైనాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తైవాన్ ను ఆక్రమించుకోవాలని చైనా చూస్తే రష్యాకు పట్టిన గతే పడుతుందని.. చైనాను సైనికంగా ఎదుర్కొంటాం అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఇటీవల చైనా సోలమన్ దీవులతో ఒప్పందం చేసు