జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు. హతమైన ఉగ్రవాదులను జైష్ […]
ఉగ్రవాద సంస్థ బోకోహారామ్ రెచ్చిపోయింది. అత్యంత పాశవికంగా మారణహోమానికి పాల్పడింది. నైజీరియా దేశంలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి జరిగింది. తమ సమాచారాన్ని నైజీరియా మిలటరీకి ఇస్తున్నారని ఈ దాడికి పాల్పడింది. దేశంలోని ఉత్తర ప్రాంతం కామెరూన్ దేశ సరిహద్దుల్లోని బోర్నో ప్రావిన్స్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 50 మంది దాకా మరణించినట్లు సమాచారం. దాడిలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు… కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పంటపొలాల్లో […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే…మరోవైపు పెట్రోల్,డిజిల్ ధరలు పెరగడంతో పాటు తీవ్ర కొరత కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు లేని పెట్రోల్ కు కూడా అక్కడి ప్రభుత్వం ధరలను పెంచుతోంది. తాజాగా శ్రీలంకలో పెట్రోల్ ధర రూ. 400 దాటింది. ఇదిలా […]
ట్విట్టర్ లో ‘గోబ్యాక్ మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 7 వేలకు పైగా ట్వీట్స్ వచ్చాయి. మే 26న మోదీ తమిళనాడు పర్యటన ఉంది. హైదరాబాద్ తో పాటు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రజల నుంచి మోదీ టూర్ పై కొంతమంది వ్యతిరేఖత వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూన్నాడంటూ ట్వీట్ చేస్తున్నారు. మాకు గుజరాత్ మోడల్ […]
దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశం అయింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారంటూ హిందు సంఘాలు చెబుతున్నాయి. ఇటీవల వారణాసి కోర్ట్ జరిపిన వీడియో సర్వేలో మసీదులోని వాజుఖానలోని కొలనులో శివలింగం బయటపడిందన్న వార్తలు బయటకు వచ్చాయి. మసీదులో వీడియో సర్వేను ఆపాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంలో పిటిషన్ వేయడం… శివలింగానికి భద్రత కల్పించాలని.. అలాగే ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. […]
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జనవరిలో థర్డ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తొలిగిపోవడంతో కేసుల సంఖ్య, వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గింది. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య వేలల్లోనే నమోదు అవుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3 వేలకు దిగువనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం […]
దేశంలో కార్ల అమ్మకాలు బాగానే పుంజుకుంటున్నాయి. అయితే వీటిలో కాంపాక్ట్ ఎస్ యూ వీలకు డిమాండ్ ఏర్పడింది. హ్యచ్ బ్యాక్ సేల్స్ ను కూడా అధిగమించేలా కాంపాక్ట్ ఎస్ యూ వీల సేల్స్ ఉన్నాయి. హ్యచ్ బ్యాక్ కార్లు వచ్చే ధరలకే కాంపాక్ట్ ఎస్ యూ వీ కార్లు వస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనేందుకే మొగ్గు చూపిస్తున్నారు. పలు కార్ల కంపెనీలు కూడా ఎస్ యూ వీ సెగ్మెంట్ లలో కొత్త కార్లను తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే […]
ప్రపంచంలో మంకీపాక్స్ వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే డజన్ పైగా దేశాల్లో కేసులను కనుక్కున్నారు. తాజాగా మరో రెండు దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ), చెక్ రిపబ్లిక్ దేశాల్లో కొత్తగా మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూఏఈకి వచ్చిన ఓ మహిళలో వైరస్ ను నిర్థారించారు. బెల్జియం నుంచి చెక్ రిపబ్లిక్ కు వచ్చిన ఓ మహిళలో వైరస్ ను కనుక్కున్నారు. చెక్ రిపబ్లిక్ […]
పెరుగుతున్న ద్రవ్యోల్భనానికి అడ్డుకట్ట వేసేందుకు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్ , డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెరుగుతున్న ఇంధన రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కలిపించింది. కేంద్రం బాటలోనే కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి. ఇదిలా ఉంటే వరసగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక […]
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే […]