Harish Rao: కేంద్రం పెంచింది బారాణా… తగ్గించింది చారాణా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. కేంద్రం పెట్రోల్, డిజిల్ పై బారాణా పెంచి చారాణా తగ్గించిందని విమర్శించారు. మార్చి 2014లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి మాట్లాడంటూ సవాల్ విసిరారు. ఎందుకోసం బీజేపీ నేతలు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు పెట్రోల్, డీజిల్ పెంచలేదని అన్నారు. డాక్టర్లు సూది ఇచ్చినట్లు మెల్లిగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయని… డీజిల్, పెట్రోల్ తగ్గించినట్లు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని అన్నారు.
కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం లేదు. ఒక్క కేసు వచ్చిందని.. ఆ వ్యక్తి కాంటాక్ట్ లను పరీక్షించాము… ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని హరీష్ రావు వెల్లడించారు. గాంధీలో రూ.25 కోట్ల విలువైన అత్యాధునిక టెక్నాలజీతో ఎంఆర్ఐ మిషన్, రూ. 9 కోట్ల క్యాత్ లాబ్, సిటీ స్కాన్ పరికరాన్ని ప్రారంభించామని వెల్లడించారు. 100 కోట్లతో గాంధీ ఆస్పత్రి అభివృద్ధి చేస్తామన్నారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ సెంటర్ చేయబోతున్నామని వెల్లడించారు. 6 రకాల అవయవాల మార్పిడి చేస్తామని తెలిపారు. అధునాతన యంత్రాలతో ప్రజలకు మెరుగైన సేవాలు అందిస్తామన్నారు.
Also Read
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని..అధునాతన కిచెన్ రూ. 2కోట్ల 70 లక్షలతో శంకుస్థాపన చేసామని తెలిపారు. డ్రైనేజీ, ఫైర్ సేఫ్టీ, డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరుస్తామని వెల్లడించారు. ఏపీ వెస్ట్ గోదావరి, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ నుంచి రోగులు వచ్చి తెలంగాణలోమోకాళ్ళ మార్పిడి చేయించు కుంటున్నారని అన్నారు. ప్రస్తుతం 1503 మంది రోగులు గాంధీలో చికిత్స పొందుతున్నారని..గాంధీలో లక్ష మంది కరోన పాజిటివ్ రోగులకు వైద్యం అందించి దేశంలోనే రికార్డులకు ఎక్కిందని అన్నారు. 1698 మంది గర్భిణీలకు వైద్యం అందించామని.. 1160 మందికి బ్లాక్, వైట్ ఫంగస్ వైద్యం అందించామని హరీష్ రావు అన్నారు. మూడు, నాలుగు లక్షల రూపాయల ఖర్చు అయ్యే మోకాళ్ళ చిప్పల మార్పిడిని ప్రభుత్వం ఉచితంగా చేస్తోందని వెల్లడించారు. 25 రకాల గుండె శస్త్రచికిత్సలు, స్టంట్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నామని..ప్రజలు ప్రైవేటుకు వెళ్లి డబ్బు వృధా చేసుకోవద్దని కోరారు. బస్తి దవాఖానాలు వచ్చిన తర్వాత ఫీవర్ ఆసుపత్రి ఓపి 4 వేల నుంచి 400కు తగ్గిందని హరీష్ రావు తెలిపారు.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!