దేశంలో యోగీ తరువాత బుల్డోజర్లను బాగా వాడుతుంది ఎవరంటే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఎదైనా ప్రభుత్వ వ్యతిరేఖ పనులకు పాల్పడ్డా… నేరాలకు పాల్పడ్డా నిందితులకు బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి తన మార్క్ చూపించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన అల్లరి మూకల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు అక్కడి అధికారులు.
శనివారం అస్సాం నాగోవ్ జిల్లా బటాద్రాబా పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టింది కొంతమంది అల్లరి మూక. పోలీస్ కస్టడీలో ఉన్న సఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి అనుకోకుండా మరణించాడు. దీంతో పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణించాడని ఆరోపిస్తూ కొంత మంది బటద్రాబా పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. స్టేషన్ లోని ఫర్నీచర్ ధ్వసం చేయడంతో పాటు స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ఈ వివాదంపై అస్సాం డీజీపీ స్పందించారు. సఫీకులు ఇస్లాం దురదృష్టవశాత్తూ మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దీనికి బాధ్యతగా బటద్రాబా పీస్ అధికారిని సస్పెండ్ చేశామని… మా దగ్గర తప్పు ఉంటే దోషులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని అన్నారు. అయితే కొంతమంది మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పీఎస్ ను తగలబెట్టారని.. వారంతా చనిపోయిన వ్యక్తి బంధువులుగా మేం భావించడం లేదని… వారందరికి నేర చరిత్ర ఉందని అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత అన్నారు.
ఇదిలా ఉంటే నిన్న జరిగిన దాడికి బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇచ్చింది నిందితులకు. ఘటనకు ప్రధాన కారణంగా భావిస్తున్న ఐదు కుటుంబాలకు చెందిన ఇళ్లను నాగోవ్ జిల్లా యంత్రాంగం కూల్చివేసింది.