తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పరిస్థితి ఉప్పూ నిప్పులా ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజసంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆ పార్టీలో జోష్ మరింతగా పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు […]
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి, వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల వ్యధలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. రైతులతో రచ్చబండ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ రెండు సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ […]
థామస్ కప్, ఉబెర్ కప్ గెలిచిన బ్యాట్మింటన్ టీమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ముచ్చటించారు. ప్రస్తుతం ఇండియాకు ‘ ఎస్ మనం దీన్ని చేయగలం ’ అనే వైఖరి శక్తిగా మారిందని ప్రధాని నరేంద్ మోదీ అన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. మొత్తం దేశం తరుపున జట్టును అభినందిస్తున్నానని మోదీ అన్నారు. థామస్, ఉబెర్ కప్ ను గెలవడం చిన్న విషయం కాదని ప్రధాని మోదీ […]
కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. ఎన్నికలకు మరో ఎడాదిన్నర ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణ వేడెక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్… దాన్ని మాత్రం ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. అయితే ఈ సారి మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. దీంతో పాటు పార్టీలో నెలకొన్న అసమ్మతిని తగ్గించేందుకు ఇటీవల కాంగ్రెస్ పెద్దలతో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ఇటీవల వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ […]
ఇండియాలో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ వారీ కేసుల సంఖ్య కూడా మూడు వేలకు లోపే నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్, నార్త్ కొరియా, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగినా… ఇండియాలో మాత్రం గత ఫిబ్రవరి నుంచి కేసుల తీవ్రత ఎక్కువగా లేదు. ఇదిలా ఉంటే తాజాగా […]
దేశంలో రోజుకు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల కేరళ తీరంలో దాదాపుగా రూ. 1500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూర్ అంతర్జాతీయ కార్గోలో పెద్ద ఎత్తున భారీగా ఎఫిడ్రీన్ పట్టివేశారు. 90 లక్షల విలువైన 5 కేజీల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్ లో ఈ డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమ రవాణా చేయాలని చూశారు. కస్టమ్ అధికారులకు ఏమాత్రం అనుమానం […]
మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇటీవల వరసగా భారత్ విధానాలను ప్రశంసిస్తున్నారు. పాకిస్తాన్, భారత్ లాగా ప్రజల ప్రయోజనాలను ఆలోచించడం లేదని పలు మార్లు విమర్శలు చేశారు. తాజాగా భారత ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించడంపై ఆయన స్పందించారు. భారత్ క్వాడ్ లో సభ్యదేశం అయినా… అమెరికా నుంచి ఒత్తడి ఉన్నా కూడా రష్య నుంచి చమురును రాయితీతోదిగుమతి చేసుకుందని ప్రశంసించారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానంలో […]
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయిన ఆయన రెండున్నర గంటల పాటు దేశ రాజకీయాలపై ముచ్చటించారు. ఆ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో కలిసి సర్వోదయ స్కూల్ ను సందర్శించారు. తాజాగా ఈ రోజు సీఎం చంఢీగడ్ వెళ్లనున్నారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు […]
పెట్రోల్ ధరల తగ్గింపు అంశంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించామని చెబుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంకెల లెక్కల గారడీ చేస్తున్నారని… కేంద్ర ప్రజలకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. గత 60 రోజుల్లో కేంద్రం పెట్రోల్ ధరలను రూ. 10కి పెంచిందని… కేవలం ఇప్పుడు రూ.9.5 తగ్గించిందని, కనీసం పెంచినంత కూడా తగ్గించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా […]
నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, […]