భారత అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శుక్రవారం రోజు ఒడిశాలోని చాందీపూర్ తీరంలో ‘‘వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం’’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ( వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం) క్షిపణిని డీఆర్డీవో డెవలప్ చేసింది. ఇండియన్ నేవీతో కలిసి ఈ రోజు పరీక్షించారు. అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ క్షిపణిని యుద్ధ నౌకల నుంచి ప్రయోగించవచ్చు. ఆకాశం నుంచి వచ్చే శత్రు దేశాల క్షిపణులను, విమానాలను మార్గం మధ్యలోనే కూల్చివేసే శక్తి వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఏం సొంతం. హై స్పీడ్ ఏరియల్ టార్గెట్లను ఖచ్చితత్వంతో ఢికొనే సత్తా దీని సొంతం. డీఆర్డీఓ, నేవీ అధికారులు అనేక ట్రాకింగ్ పరికరాల ద్వాారా క్షిపణి గమనాన్ని నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్షిపణి ప్రయోగంతో భారత సైన్యం శక్తి మరింత పెరిగింది. క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, నేవీకి అభినందనలు తెలియజేశారు. వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం క్షిపణి స్వల్ప శ్రేణి క్షిపణి. తక్కువ లక్ష్యాల్లోని దూరాలను లక్ష్యంగా చేసుకునేలా దీన్ని రూపొందించారు.
జూన్ నెల ప్రారంభంలో ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-4 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీడో, సైన్యం సంయుక్తంగా ప్రయోగించారు. ఈ పరీక్ష కూడా సక్సెస్ అయింది.
Vertical Launch Short Range Surface to Air Missile (VL-SRSAM) was successfully flight tested today by Defence Research & Development Organisation (DRDO) & Indian Navy. The launch was conducted from Indian Naval Ship, off the coast of Chandipur, Odisha: DRDO officials pic.twitter.com/fzr8w4Pniv
— ANI (@ANI) June 24, 2022