BA.2.75: ఇండియాలో కొత్తగా ఓమిక్రాన్ సబ్ వేరియంట్ గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా పిలిచే ఈ వేరియంట్ భారత్ తో పాటు 10 దేశాల్లో కూడా గుర్తించారు. ఈ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా ఇండియాలో బయటపడిన వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కన్నా తీవ్రంగా ఉందో లేదో ఇంకా నిర్థారించలేదు.
ప్రపంచ వ్యాప్తంగా గడిచిన రెండు వారాల్లో కేసుల సంఖ్య 30 శాతం పెరిగినట్లు టెడ్రోస్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసుల పెరుగుదలకు ఓమిక్రాన్ స్ట్రెయిన్ సబ్ వేరియంట్లు కారణం అని ఆయన అన్నారు. బీఏ.4. బీఏ.5 వేరియంట్లు యూరప్, యూఎస్ఏలో కోవిడ్ కేసులకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 వేరియంట్ ను కనుగొన్నామని టెడ్రోస్ అన్నారు.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
Read Also: Flexes in Hyderabad: సిలిండర్ ధర పెంపుపై హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు
గతంలో వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ల కన్నా బీఏ.2.75 వేరియంట్ భిన్నంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఈ వేరియంట్ టీకా ఇచ్చిన తర్వాత వ్యాధినిరోధక శక్తి నుంచి తప్పించుకోగలదా అని చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు. అయితే ఈ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్ బైండిగ్ డొమైన్ పై కొన్ని ఉత్పరివర్తనాలు కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!