మహారాష్ట్ర, కర్ణాటకలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలో వర్షాలపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ReadAlso: YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు అమలు..
మహరాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలకు ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఒ పశ్చిమ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూణే, సతారా, కొల్హాపూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొల్హాపూర్ జిల్లాలో పంచగంగ నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. రానున్న మూడు రోజులు కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పంచగంగతో పాటు దూద్ గంగా, హిరణ్యకేషి, ఘటప్రభ నదుల్లో ప్రవాహ తీవ్రత పెరిగింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత నాలుగు రోజుల నుంచి వరసగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోకల్ ట్రైన్స్, సెంట్రల్ రైల్వేపై తీవ్ర ప్రభావం పడింది.