బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పటికే ఆయన మంత్రి వర్గం నుంచి ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేశారు. క్యాబినెట్ లో కీలక మంత్రులు రిషి సునక్, సాజిద్ జావిద్ తో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతోంది. బుధవారం వరకు మొత్తం ఆరుగులు మంత్రులు రాజీనామా చేసి బోరిస్ జాన్సన్ పై ఒత్తడి పెంచారు. ఇదిలా ఉంటే రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలోని 54 మంది మంత్రులు రాజీనామా చేశారు. దీంతో చేసేదేం లేక బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారని తెలిసింది.
Read Also:Sreejith Ravi: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. నటుడు అరెస్ట్
బోరిస్ జాన్సన్, అతని సన్నిహితుడు క్రిస్ పై వచ్చిన ఆరోపణలతో బ్రిటిష్ రాజకీయంలో సంక్షోభం తలెత్తింది. క్రిస్ పై వచ్చిన ఆరోపణల నుంచి బోరిస్ జాన్సన్ కాపాడాడని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. దీంతో పాటు కరోనా సమయంలో నిబంధనలను ఉల్లంఘించి పార్టీలు ఇచ్చారని బోరిస్ జాన్సన్ స్వపక్షం కన్సర్వేటివ్ పార్టీనే విమర్శించింది. దీనికి తోడు రష్యా,ఉక్రెయిన్ యుద్ధ సమయం నుంచి యూకే ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. వీటన్నింటి మధ్య బోరిస్ జాన్సన్ రాజీనామా చేయనున్నారు. ప్రధాని పదవి కోసం కన్సర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉండే అవకాశం ఉంది.