UK PM Race- Rishi Sunak: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. ఎన్నికల్ ప్రచారంలో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సునక్ మరోసారి బ్రిటన్ మహిళలకు, పిల్లలకు అండగా నిలుస్తానంటూ వాగ్ధానం చేశారు. దేశంలో హద్దులు మీరుతున్న గ్రూమింగ్ ముఠాల నిర్మూలిస్తానని..గ్రూమింగ్ ముఠాకు చెందిన వారికి జీవిత ఖైదు ఎదుర్కొంటారని..ప్రజలకు హామీ ఇచ్చారు. లైంగిక నేరగాళ్లను మరింత అణచివేస్తాం అని.. డౌన్ బ్లౌజింగ్ గా పిలవడాన్ని నిషేధిస్తానని అన్నారు. మహిళల అనుమతి లేకుండా..గ్రూమింగ్ గ్రూపులు అసభ్యకరమైన ఫోటోలను తీయడాన్ని నిషేధిస్తానని అన్నారు.
Read Also: Honey-Trap: పాకిస్తాన్ వలపు వలలో ఆర్మీ జవాన్.. అరెస్ట్
మహిళలు, బాలికపై లైంగిక హింసను ఓడించే వరకు జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించాలని అన్నారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వారు సాయంత్రం షాంపింగ్ వెళ్లేటప్పుడు ఎలాంటి భయం లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నానని.. అన్నారు. లైంగిక నేరగాళ్లపై విచారణ పెంచేందుకు సహాయపడే విధంగా సరికొత్త పోలీసింగ్ విధానాన్ని తీసుకువస్తానని అన్నారు. గ్రూమింగ్ గ్యాంగులపై నిఘా పెంచేందుకు నేషనల్ గ్రూమింగ్ గ్యాంగ్స్ విజల్ బ్లోయర్ నెట్ వర్క్ ప్రారంభిస్తానని.. అనుమానితులను పర్యవేక్షించేదుకు సహాయపడేందుకు ప్రత్యేక డేటాబేస్ రూపొందించాలని యోచిస్తున్నారు రిషి సునక్. మహిళలను వేటాడే ప్రమాదకర నేరస్తులను పట్టుకునే వరకు సురక్షిత సమాజంలో మనం జీవించే వరకు నేను వెనుదిరగనని అన్నారు.
ఏమిటి ఈ డౌన్-బ్లౌసింగ్
యూకేలో గ్రూమింగ్ గ్యాంగులు పెద్ద సమస్యగా మారాయి. డౌన్-బ్లౌసింగ్ అని పిలువడే అసభ్యకరమైన చిత్రాలు తీస్తున్నారు. మహిళలు వంగినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి గ్రూమింగ్ ముఠాలు వారి శరీరం పై భాగాన్ని ఫోటో తీసే నేరాలు పెరిగాయి. మహిళలకు తెలియకుండా వారి వక్ష భాగాలను ఫోటోలు తీస్తున్నాయి ఈ గ్రూమింగ్ ముఠాలు. మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి వారిని లైంగికంగా వాడుకోవడంతో పాటు వారి ఫోటోలను సేకరిస్తాయి ఈ గ్రూమింగ్ ముఠాలు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వ్యాప్తంగా పెరుగుతున్న ఈ జాడ్యాన్ని అణచివేసేందుకు రిషి సునక్ పట్టుదలగా ఉన్నారు. తాను ప్రధాని అయితే ముందుగా ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నారు.