Israel Attack On Gaza: పాలస్తీనాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Attack On Gaza: పాలస్తీనా గాజా సిటీలోని మిలిటెంట్లు లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ‘ బ్రేకింగ్ డాన్ ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా దాడులను చేసింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయిల్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ ఉగ్రవాద కమాండర్ తో సహా మొత్తం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్ లో ఉగ్రవాదులు ఉన్న భవనంపై ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్ దాడులు చేసింది.
Read Also: Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత 88 శాతం తగ్గిన శాంతి భద్రతల సమస్యలు
Also Read
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
- Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
దాడులకు ముందు ఇజ్రాయిల్ తన భూభాగంలో సరిహద్దుకు 80 కిలోమీటర్ల లోపు ప్రజల కార్యకలాపాలను తగ్గించింది. ఇటీవల వెస్ట్ బ్యాంకులో ఇస్లామిక్ జీహాద్ టెర్రరిస్ట్ నాయకుడుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీకారదాడులకు పాలస్తీనా పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దులకు సైన్యాన్ని పంపింది. గత 15 ఏళ్లుగా పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ కు మధ్య 4 యుద్ధాలు జరిగాయి. ఇటీవల జెరూసలెం ప్రాంతాల్లో కూడా ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పాలస్తీనాలోని ఇస్లామిక్ జీహాద్, హమాస్ రెండూ ఇజ్రాయిల్ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!