Article 370 revocation: జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తర్వాత అన్నంతగా శాంతి భద్రత ఘటనల్లో మార్పు వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత మూడేళ్లలో 88 శాతం శాంతి భద్రత ఘటనలు తగ్గాయని రాష్ట్రపోలీసులు వెల్లడించారు. ఆగస్టు 5, 2016 నుంచి ఆగస్టు 4, 2019 వరకు మూడేళ్లలో మొత్తం 3,686 శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆగస్ట్ 5, 2019 నుంచి ఆగస్టు 4,2022 వరకు మూడేల్లలో కేవలం 438 సంఘటనలు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది 88 శాతం తగ్గుదల అని పోలీసులు వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్లో అల్లర్ల కారణంగా 2019 కన్నా ముందు మూడేళ్లలో 124 సాధారణ పౌరులు మరణించారు. అయితే 2019 నుంచి 2022 మధ్య ఇలాంటి అల్లర్లలో ఒక్కరూ కూడా మరణించలేదు. ఇదే విధంగా అల్లర్ల కారణంగా 2019కి ముందు మూడేళ్లలో మొత్తం ఆరుగులు పోలీస్, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తరువాత నుంచి ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాలేదు. ఆర్టికల్ 370కి ముందు కాశ్మీర్ లో ఉగ్రదాడుల కారణంగా 290 భద్రతా సిబ్బంది మరణిస్తే.. 2019 నుంచి 2022 వరకు 174 మంది మాత్రమే చనిపోయారు. ఉగ్రదాడుల్లో 2019కి ముందు మూడేళ్లలో 191 మంది పౌరులు మరణిస్తే.. ప్రస్తుతం ఈ సంఖ్య 110కి పడిపోయిందని తెలిపారు.
Read Also: Tejas Aircraft: భారత తయారీ “తేజస్” యుద్ధవిమానంపై విదేశాల ఆసక్తి.
ఎన్నో ఎళ్లుగా కాశ్మీర్ ను భారత్ లో పూర్తిగా అంతర్భాగం కాకుండా అడ్డుగా నిలుస్తున్న ఆర్టికల్ 370, 35 ఏ లను బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా.. భారత రాజ్యాంగం కిందికి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ ను విభజించి జమ్మూ కాశ్మీర్, లఢాఖ్ అనే కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. అయితే భారత నిర్ణయంతో పాకిస్తాన్ ఏడుపు ఒక్కటే తక్కువ. ఆర్టికల్ 370 రద్దు కు ముందు దీన్ని అడ్డుగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు.. కాశ్మీర్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించింది పాకిస్తాన్. నిత్యం రాళ్ల దాడులతో శాంతి భద్రత సమస్యలు ఏర్పడేవి. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాళ్లదాడులు బంద్ అయ్యాయి. వరసగా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెడుతున్నాయి.