India Offers To Sell 18 tejas To Malaysia: భారత్ ఆయుధాాల తయారీలో ఆత్మనిర్భర్ గా తయారయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లు మిలిటరీ సాంకేతికత, పరికరాల, ఆయుధాల కోసం రష్యా, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడిన ఇండియా ఇటీవల సొంతంగా ఆయుధాలను, అత్యాధునిక క్షిపణులను తయారు చేసుకుంటోంది. తేజస్ తో పాటు ప్రపంచంలోనే అత్యుత్తమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిపై పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలకు విక్రయిస్తోంది ఇండియా. ఇదే విధంగా లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ పై కూడా చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ వద్ద నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
మలేషియాకు 18 తేజస్ యుద్ధవిమానాలను విక్రయించేందుకు భారతదేశం ప్రతిపాదించింది. గతేడాది అక్టోబర్ లో రాయల్ మలేషియా ఎయిర్ ఫోర్స్ నుంచి తేజస్ విమానాల కోసం హిందూస్థాన్ ఎరోనాటిక్స్ కు ప్రతిపాదన వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ కు తెలిపింది. మలేషియాతో పాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఈజిప్టు, యూఎస్ఏ, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా తేజస్ యుద్ధవిమానాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 నుంచి డెలవరీ కోసం 83 తేజస్ జెట్ల తయారీకీ రూ. 6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును హిందూస్తాన్ ఎరోనాటిక్స్ కు ప్రభుత్వం ఇచ్చింది.
Read Also: Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ
దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా రక్షణ రంగ పరికరాలను ఎగుమతి చేసి భారత్ సత్తాను చాటాలనుకుంటోంది. ఇప్పటికే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను వియత్నాం, ఫిలిప్పీన్స్ కు అమ్ముతోంది ఇండియా. చైనాతో ఈ రెండు దేశాలకు ప్రమాదం పొంచి ఉండటంతో ఇండియా వీటికి అండగా నిలుస్తోంది. సూపర్ సోనిక్ వేగంతో వెళ్లే ఈ క్షిపణిని భూమికి తక్కువ ఎత్తులో దూసుకెళ్లి టార్గెట్స్ ను ఛేధిస్తాయి. రాడార్లకు చిక్కకుండా వెళ్లడం ఈ క్షిపణుల ప్రత్యేకత. మరోవైపు ప్రస్తుతం ఇండియా స్టెల్త్ పైటర్ జెట్ల తయారీపై కసరత్తు చేస్తోంది.