COVID 19 CASES UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య గతం రోజుతో పోలిస్తే పెరిగాయి. నిన్న 12,751 వేల కేసులు నమోదు అవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19,539 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261గా ఉంది. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మహమ్మారి బారిన పడి 54 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 4.94గా ఉంది.
కరోనా ప్రారంభం అయిన గత రెండున్నరేళ్లలో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 4,41,90,697 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో కరోనా నుంచి 4,35,35,610 మంది కోలుకున్నారు. 5,26,826 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.52 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 0.29 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
Read Also: Cricket: అత్యుత్సాహమే పాక్ కొంపముంచుతోంది.. భారత్ గెలుపుపై పాక్ బ్యాటర్ కామెంట్స్
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ 200 కోట్లను దాటింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే కేసులు సోకుతున్నా.. మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. దేశంలో ఇప్పటి వరకు 207.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు. నిన్న ఒక్క రోజులోనే 15,21,429 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇక ప్రపంచం వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. జపాన్ లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. జపాన్ లో కొత్తగా 1,72,998 మందికి మహమ్మారి సోకింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 59,09,91,820 కు చేరింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 64,41,530 మంది మరణించారు. దక్షిణ కొరియా, జర్మనీ, అమెరికా దేశాల్లో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 50 వేలకు పైగానే ఉంది.