BJP criticizes Nitish Kumar: బీజేపీ బంధానికి స్వస్తి చెప్పి ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ వైదొలిగింది. దీంతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రేపటి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే బీజేపీతో బంధాన్ని తెంచుకోవడంపై బీజేపీ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
2017లో జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తుందని నితీష్ కుమార్ అన్నారు.. ఇప్పుడు మళ్లీ జేడీయూను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అంటున్నారని.. బీజేపీ నుంచి విడిపోవడానికే నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. తన వ్యక్తిగత ఆశయాల కోసం ఇలా చేస్తున్నారని.. బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని.. బీహార్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం తార కిషోర్ ప్రసాద్ విమర్శించారు. నితీష్ కుమార్ కాంగ్రెసేతర నాయకుడు.. ఆయన రాజకీయం కాంగ్రెస్ వ్యతిరేకంగా నడించింది.. అయితే తాజాగా కాంగ్రెసేతర వాదంతో రాజీకి వచ్చాడని.. అవినీతి, కాంగ్రెస్ వాదం వైపు నితీష్ కుమార్ నిలిచాడని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
Read Also: Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?
కేంద్ర మంత్ర నిత్యనంద రాయ్ మాట్లాడుతూ.. 1975 బీహార్ ఉద్యంలో యువత తమ ప్రాణాలు అర్పించారని.. నితీష్ కుమార్, కాంగ్రెస్- ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం వల్ల యువత చేసిన బలిదానాలను మోసం చేస్తున్నారని.. 15 ఏళ్ల అరాచకం, తీవ్రవాదంతో రాజీపడటం ఏంటని ప్రశ్నించారు. ఆర్జేడీ, తేజస్వీ యాదవ్ తో కలిసి వెళ్లడం బీహార్ ప్రజలను మోసం చేయడమే అని..లోహియా-జేపీ-జార్జ్ సిద్ధాంతాలకు ద్రోహం చేశారని నిత్యానందరాయ్ విమర్శించారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమి కట్టడం అంటే.. నితీష్ అధికారం కోసం ఏదైనా చేస్తాడని రుజువు చేసిందని విమర్శలు గుప్పించారు. హర్యానా హోంశాఖ మంత్రి అనిత్ విజ్, నితీష్ కుమార్ వ్యవహారంపై సంచలన ట్వీట్ చేశారు. నితీష్ కుమార్ వలస పక్షి అని.. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు దునుకుతున్నాడని.. ప్రస్తుతం పక్షులంతా ఒక కొమ్మమీద ఉన్నాయి.. ఇందులో ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఎగరతారో ఎవరకీ తెలియదంటూ.. పరోక్షంగా అసమ్మతి గురించి వ్యాఖ్యానించారు.