Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ నటిస్తున్న మహింద్రగిరి వారాహి టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. చాలా కాలం తర్వాత సుమంత్ ఓ విభిన్నమైన కథతో వస్తుండటం మిస్టికల్ థ్రిల్లర్ జోనర్, వరాహి దేవి సెంటిమెంట్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తికి, వెండితెరకు సరికొత్త వారధిని నిర్మిస్తూ చిత్ర పరిశ్రమలో ఒక వినూత్నమైన ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు తెరలేపింది ‘మహేంద్రగిరి వారాహి‘ చిత్ర బృందం. కేవలం ఆలయాలకే పరిమితం కాకుండా అమ్మవారి వైభవాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్ల ద్వారా లక్షలాది మంది భక్తులకు చేరవేసేందుకు అమ్మవారి కృపను పొందేందుకు భక్తులందరికీ చిత్ర యూనిట్ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది.
VarahiAmmavariAagamanam పేరుతో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు హైదరాబాద్, మూసాపేట్‌లోని శ్రీ రాములు థియేటర్ లో వారాహి అమ్మవారి ప్రతిమను ప్రతిష్టించనున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర బృందం మొత్తం హాజరుకానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం కేవలం ట్రైలర్స్, సాంగ్స్ మాత్రమే కాకుండా భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా థియేటర్లలో విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. సినిమా థియేటర్లను అమ్మవారి దివ్య సన్నిధులుగా మారుస్తూ లక్షలాది మందిని కనెక్ట్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ పవిత్రమైన విగ్రహావిష్కరణ వేడుకను కళ్లారా వీక్షించడానికి మరియు వారాహి అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులందరూ తరలిరావాలని చిత్ర యూనిట్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో ఇదొక అత్యంత వినూత్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన క్యాంపెయిన్‌గా ఇండస్ట్రీలో నిలవనుంది.
Also Read
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
- Ramayana: "డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?".. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
- Simbu - Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
- Tags
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!