Gujarat Court Verdict on Cow Smuggling: అక్రమంగా పశువు రవాణా చేసిన వ్యక్తి కేసులో తీర్పు చెబుతూ గుజరాత్ కోర్టు కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమిపై అన్ని సమస్యలు తీరుతాయని.. తాపి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. న్యాయమూర్తి ఎస్వీ వ్యాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్ నుంచి ప్రభావితం కావు అని.. ఆవు మూత్రం అనేక నయం లేని రోగాలకు నివారణ అని అన్నారు. ఆవు పేడతో చేసిన ఇళ్లు అణు వికిరణం బారిన పడవి సదరు జడ్డి అన్నారు.
Read Also: Pakistan: పాక్‌లో హిందువులపై ఆగని అఘాయిత్యాలు.. హిందూ బాలిక కిడ్నాప్, అత్యాచారం
ఇంకా, మతం అనేది ఆవు నుంచి పుడుతుందని.. ఆవు ఒక జంతువే కాదు తల్లి అని..68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతలకు నిలయం అని పేర్కొన్నారు. వివిధ శ్లోకాలను ప్రస్తావిస్తూ.. ఆవును సంతోషంగా లేనట్లయితే, మన సిరిసంపదలు అదృశ్యం అవుతాయని అని కోర్టు పేర్కొంది. గోవధను వాతావరణ మార్పులతో కూడా జడ్జి ముడిపెట్టారు. ఈ రోజు ఉన్న సమస్యలకు ఆవేశం, కోపమే కారణం అని దీనికి కారణం గోవధ అని అన్నారు. దీనిని పూర్తిగా నిషేధించే వరకు సాత్విక వాతావరణం రాదని అన్నారు. అయితే జడ్జి చెప్పిన మాటలకు పెద్దగా సైంటిఫిక్ రుజువులు మాత్రం లేవు.
గత ఏడాది ఆగస్టులో 16 గోవులను అక్రమంగా రవాణా చేయడంపై ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో తీర్పు చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జడ్జి. సదరు వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ. 5 లక్షల జరిమానా విధించారు.