Bengaluru: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత్ లో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ కు చెందిన టీనేజ్ యువతి బెంగళూర్ లో పట్టుబడింది. 19 ఏళ్ల పాకిస్తాన్ కు చెందిన యువతిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్రా జీవని అనే యువతి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములాయం సింగ్(25) అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు బెంగళూర్ లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ములాయం సింగ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ములాయం సింగ్ బెంగళూర్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ పర్సన్ గా పనిచేస్తున్నాడు.
Read Also: Metro Train Stopped: మళ్లీ మెరాయించిన మెట్రో.. ఈసారి ఎల్బీనగర్ వైపు..
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సులోని హైదరాబాద్ నగరానికి చెందిన యువతి, ఓ గేమింగ్ యాప్ ద్వారా ములాయం సింగ్ కు పరిచయం అయింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. గేమింగ్ యాప్ లూడో ద్వారా వీరిద్దరికి పరిచయం అయినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఇక్రాను నేపాల్ లోని ఖాట్మాండు మీదుగా భారతదేశానికి రప్పించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని బెల్లందూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ క్వార్టర్స్ లో స్థిరపడ్డారు. ప్రస్తుతం యువతిని ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ)కి అప్పగించారు.